Hailstones Damages Airplane: దేశ రాజధాని ఢిల్లీ నుంచి జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానంలో ప్రయాణికులకు అత్యంత భయానక అనుభవం ఎదురైంది. విమానం గాల్లో ఉండగా ఉన్నట్టుండి వడగళ్ల వర్షం కురిసింది. పెద్ద పెద్ద వడగళ్లు ఎవరో రాళ్లతో కొట్టినట్టే విమానంపై పడ్డాయి.
వడగళ్ల దెబ్బకు విమానం ముందు భాగం గాల్లోనే ధ్వంసమైంది. ఈ విమానంలో 227 మంది ప్రయాణికులు ఉండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలెట్ .. క్యాబిన్ సిబ్బంది ప్రయాణికులకు ధైర్యం చెప్పి శ్రీనగర్ విమానాశ్రయంలో సాయంత్రం విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ విమానం ల్యాండ్ అవగానే ఏం జరిగిందో ఎయిర్ పోర్ట్ సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. ఈ ఘటనలో విమానం ముందుభాగం విరిగిపడింది. తాజా ఘటనలో.. ఇండిగో విమానానికి ఏం జరిగిందో ఇండిగో యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఢిల్లీలో అకాల వర్షాలతో పాటు వాతావరణ మార్పుల కారణంగా పలు విమానాలను రద్దు చేసారు. దీంతో అత్యవరసర పనులతో ఎయిర్ పోర్ట్ కు వచ్చినవారు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.