Heavy Rains Across India: దేశ వ్యాప్తంగా విస్తరించిన ఋతు పవనాలు.. ఇక వానలే వానలు..

Heavy Rains Across India: దేశవ్యాప్తంగా వాతావరణం మారబోతుంది. ఈ వారంలో దేశ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు  చురుకుగా  కదులుతున్నాయన్నారు. ఆ  కారణంగా దేశ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయని తెలిపింది.  ఈశాన్య భారతదేశంలో ప్రస్తుతం రుతుపవనాల ప్రభావంతో చురుకుగా కదులుతున్నాయి. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 9, 2025, 11:45 AM IST
Heavy Rains Across India: దేశ వ్యాప్తంగా విస్తరించిన ఋతు పవనాలు.. ఇక వానలే వానలు..

Heavy Rains Across India: ఋతుపవనాలు దేశ వ్యాప్తంగా చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో జూన్ 11 నుంచి 14 వరకూ అరుణాచల్ ప్రదేశ్‌, అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. దీంతోపాటు నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాం ప్రాంతాల్లో జూన్ 10 నుంచి 13 వరకూ వర్షాలు కురిస్తాయంటోంది. కానీ త్రిపురలో   తీవ్రగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Add Zee News as a Preferred Source

దక్షిణ భారత దేశంలోనూ వానలు పడతాయంటోంది వాతావరణశాఖ.  కేరళ, మహే, తీర ప్రాంతాలైన కర్ణాటక, లక్షద్వీప్ లలో ఈ వారం మొత్తం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. జూన్ 10 నుంచి 14 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, తూర్పు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ 13, 14న కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ హెచ్చరించింది. జూన్ 12న కర్ణాటకలో 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరిక జారీచేసింది.  

అలాగే  బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గంగా తీర ప్రాంత బెంగాల్ లలో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వానలు కురుసే అవకాశాలున్నాయని తెలిపింది. బిహార్ లో  జూన్ 11, 12 తేదీలలో గంటకు 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ  అంచనా వేసింది. అయితే ఉత్తర భారత్‌లో విభిన్న వాతావరణం వుంటుందని తెలిపింది.  రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో 11 వరకూ వేడి గాలులు వీస్తాయని వాతవరణశాఖ అంచనా వేసింది. పశ్చిమ రాజస్థాన్‌లో జూన్ 9న వేడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక. పంజాబ్, హర్యానా, ఢిల్లీలకు జూన్ 9, 10 తేదీలలో హాట్ నైట్స్ అంటే రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవచ్చని IMD వెల్లడించింది. కానీ జూన్ 11 నుంచి 14 వరకూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా.

ఇక పశ్చిమ భారత్‌ లో వానలు కురుస్తాయంటోంది భారత వాతావరణశాఖ . కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతాల్లో జూన్ 8 నుంచి 14 వరకూ వర్షాలు కొనసాగుతాయంటోంది. జూన్ 12 నుంచి 14 వరకూ కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేసింది. అలాగే మధ్య, వాయవ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు వచ్చే 3 రోజుల్లో 2-3 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల వేడిగాలుల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణశాఖ తెలిపింది. 

Also Read:  Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా

Also Read:  NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News