Heavy Rains: నైరుతి ఋతు పవనాల కారణంగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు..

Heavy Rains: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో రుతు పవనాల ఎఫెక్ట్​ తో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 1, 2025, 10:52 AM IST
Heavy Rains: నైరుతి ఋతు పవనాల కారణంగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు..

Heavy Rains: నైరుతి మన దేశంలో కేరళలో మొదటగా ప్రవేశిస్తాయి. ఈ నేపథ్యంలో కేరళలో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అంతేకాదు కేరళలోని పలు జిల్లాల్లో ప్రవహిస్తున్న వరదల కారణంగా వందలాడి ఇండ్లు నీట మునిగాయి. ఇక ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. అటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాల్లో  వానలు ముంచెత్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో దాదాపు 10 మందికి పైగా మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి.  ఇక  ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, త్రిపుర మిజోరాం, నాగాలాండ్​ లలో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి పదిమంది మృతి చెందారు. 

Add Zee News as a Preferred Source

ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాల కారణంగా సంభవించిన విపత్తులలో మృతుల సంఖ్య 10కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో గౌహతి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందారు. మేఘాలయలో ఇద్దరు, మిజోరం, నాగాలాండ్, త్రిపురలలో ఒక్కొక్కరు చొప్పున కొండచరియలు విరిగిపడటం, వరదనీటిలో మునిగిపోయి ఐదుగురు చనిపోయారు. 

అసోంలోని గౌహతిలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. అసోం పశ్చిమ ,దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. అసోంలోని లఖింపూర్‌తో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. మేఘాలయలో కూడా భారీవర్షాలు బీభత్సం సృష్టించాయి.  భారీ వర్షాలకు ముగ్గురు మృతి. గడిచిన 24 గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో వృద్ధురాలు, మైనర్ సహా ముగ్గురు మృతిచెందారు. 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో సాధారణ జనజీవనం తీవ్రంగా అస్తవ్యస్తమైంది. మిజోరాంలో  భారీ వర్షం కారణంగా 5 ఇళ్లు, హోటల్ కూలిపోవడంతో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. లాంగ్ట్లైలోని బజార్ వెంగ్ ,చాంద్మేరి ప్రాంతాల సరిహద్దు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఇళ్ళు ,హోటల్‌ను ధ్వంసమైంది. హోటల్‌లో బస చేసిన మయన్మార్‌కు చెందిన అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.
కేరళలో నైరుతి రుతుపవనాలతో కురిసిన భారీ వర్షాలకు ఏడుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మరో రెండు రోజులు భారీ వర్షాలున్నందుకు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచించింది. తిరువనంతపురం జిల్లాలో రెండు ఫిషింగ్ బోట్లలో సముద్రంలోకి వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు గల్లంతయింది.

Also Read:  NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..


Also Read:  Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News