Kerala Rains: కేరళను ముంచెత్తిన వరదలు.. వందల ఇళ్లు నేలమట్టం..

Kerala Rains: భారీ వర్షాలు కేరళలో బీభత్సం సృష్టిస్తున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న భీకర వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొన్ని పాక్షికంగా ధ్వంసమయ్యాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 1, 2025, 08:20 AM IST
Kerala Rains: కేరళను ముంచెత్తిన వరదలు.. వందల ఇళ్లు నేలమట్టం..

Kerala Rains: శనివారం నుంచి  కురిస్తోన్న భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. రోడ్లపైనే వర్షం నీరు నిలిచిపోవడం, విద్యుత్  సరఫరా బంద్ అవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు ప్రాంతాల్లో ఇళ్లను నీరు చుట్టుముట్టింది. పీకలోతు నీటిలో బతుకుజీవుడా అంటూ జనం సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వరద ధాటికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. 

Add Zee News as a Preferred Source

భారీ వర్షాలకు చెట్లు పడిపోయే అవకాశం ఉందని, విద్యుత్ వైర్లు తెగిపడవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, పథనం తిట్ట, అళప్పుజ, కొట్టాయం, కన్నూర్, కాసర్​గోడ్  జిల్లాలకు ఐఎండీ రెడ్  అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. 

డేంజర్  జోన్లలో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్​ క్యాంపులకు వెళ్లిపోవాలని కోరింది. ప్రస్తుతం 66 క్యాంపులు ఏర్పాటు చేశామని, మరో 4 వేల క్యాంపులు ఓపెన్  చేయనున్నట్లు తెలిపింది. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఇండియన్  నేషనల్  సెంటర్  ఫర్  ఓషియన్  ఇన్ఫర్మేషన్  సర్వీసెస్ ఇన్ కాయిస్ హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో సముద్రంలో అలలు 3 నుంచి 3.9 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని తెలిపింది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం కారణంగా రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. 

Also Read:  NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..


Also Read:  Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News