Mumbai Rain Weather updates: దేశ ఆర్ధిక రాజధాని వర్షాలతో అతలాకుతలం అవుతుంది. ఎడతెరపి లేని వర్షాలతో ముంబైలోని మెజారిటీ ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ నేడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వంతో పాటు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. అటు డిజాస్టర్ మేనేజెమ్ంట్ వాళ్లు రంగంలోకి దిగి ఎప్పటి కపుడు నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది.భారీ వర్షాలకు ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో భారీగా నీరు చేరింది. ఎయిర్ పోర్టులోనూ నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. దీంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఆర్ధిక రాజధాని ముంబైలో నిన్న ఒక్కరోజే ముంబైలో 30 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కేవలం 81 గంటల వ్యవధిలోనే ముంబైలో 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ఇది దాదాపు ఆగస్టు నెల సగటు వర్షపాతంతో సమానం. నగరానికి తాగునీరు అందించే ఏడు సరస్సులలో ఒకటైన విరార్ సరస్సు నిండి పొంగిపొర్లింది. రత్నగిరి, రాయగడ్, హింగోలి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు.
ముంబైతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు ఈ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ముంబైలో వానల పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తగిన సహాయక చర్యలు తక్షణమే తీసుకోవాలని ఆదేశించారు. ముంబైలో జరిగిన వేర్వేరు విషాద ఘటనలపై తీవ్ర ఆవేదనకు గురిచేశాయన్నారు.
ఇదీ చదవండి: అప్పట్లో బి సరోజా దేవి.. ఇప్పట్లో సమంత ఆ అవమానాన్ని ఎదుర్కొన్నవారే..
ఇదీ చదవండి: కూలీ’ కంటే ముందు రజినీ, నాగ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ మూవీ.. పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









