Summer Rains: ఉత్తర భారతంలో కురుస్తోన్న భారీ వర్షాలు.. జమ్మూ కశ్మీర్ సహా పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్..

Summer Rains: దేశంలో కురుస్తున్న అకాల వర్షాలు  ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. జమ్ము కశ్మీర్‌లో కురిసిన అకాల వర్షాలు, తలెత్తిన వరదు ముగ్గురి ప్రాణాలు తీశాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 21, 2025, 01:30 PM IST
Summer Rains: ఉత్తర భారతంలో కురుస్తోన్న భారీ వర్షాలు.. జమ్మూ కశ్మీర్ సహా పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్..

Summer Rains:దేశ వ్యాప్తంగా ఎండా కాలంలో అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సమ్మర్ లో కురిసే ఈ వానల కారణంగా జమ్మూ కశ్మీర్లో కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. ఇప్పుడు భారత వాతావరణ శాఖ  ఏప్రిల్ 21న జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతంలో వర్షాలతోపాటు గంటకు 70 కి.మీ. వేగంతో గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసింది.

Add Zee News as a Preferred Source

జమ్మూ కశ్మీర్‌తో పాటు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయా ప్రాంతాల్లో ఏప్రిల్ 22 నుంచి 24 వరకు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానికంగా వరదలు, అంతరాయాలు ఏర్పడవచ్చని తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలతోపాటు గంటకు 30-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఈశాన్య భారతదేశంలో కూడా రాబోయే ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.

మరోవైపు వర్షాలు దంచికొడుతుంటే …  వాయవ్య, మధ్య భారతదేశంలో మాత్రం హీట్‌వేవ్ హడలెత్తిస్తోంది. విదర్భ, దక్షిణ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో రాబోయే ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. వడగాలుల వీచే ఛాన్సుంది కాబట్టి, బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News