)
Yellow Alert In Telugu States: ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాలో ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ప్రధానంగా జనగాం, భూపాల పల్లి, గద్వాల్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, పెద్దపల్లి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలో మోస్తారు వర్షాలు ఈరోజు కురుస్తాయని తెలిపింది.
ఇక కామారెడ్డి, మెదక్ ,రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీలోని అల్లూరి, ఏలూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ప్రధానంగా విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, బాపట్లలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇక నిన్న 16 సెంటీమీటర్ల వర్షపాతం శ్రీకాకుళంలో నమోదు కాగా.. కళింగపట్నం 13, వైజాగ్ లో 11 వర్షపాతం నమోదయింది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక రేపు, ఎల్లుండి కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని apsdma తెలిపింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు, బాపట్లలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇక ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా పేర్కొన్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది జిల్లాలో కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తావీ నదిపై వంతెన కూడా కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు. కానీ ఉదంపూర్‌లో 12 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. 54 సెంటీమీటర్ల వర్షపాతం 12 గంటల నమోదు అయినట్లు ఐఎండి తెలిపింది. ఇక ఒక్కరోజులో ఇదే అది అత్యధికమని పేర్కొంది. జమ్మూలో 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక తెలుగు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాహనదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. అయితే రోడ్డుపై వెళ్తున్న వాహనాలు నీటి గుంతల ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.