Floods In Sikkim: మిలిటరీ క్యాంప్‌పై విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి, 9 మంది ఆచూకీ గల్లంతు..

Sikkim Landslide: సిక్కింలో కుండపోతగా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో మిలిటరీ క్యాంపుపై కొండ చరియలు విరిగి పడటంతో స్పాట్లో ముగ్గురు జవాన్ లు దుర్మరణం చెందగా, మరో తొమ్మిది మంది ఆచూకీ గల్లంతయ్యింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jun 2, 2025, 03:48 PM IST
  • సిక్కింలో భారీ వర్షాలు..
  • బెంబెలెత్తిపోతున్న ప్రజలు..
Floods In Sikkim: మిలిటరీ క్యాంప్‌పై విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి, 9 మంది  ఆచూకీ గల్లంతు..

Landslide hits army camp in sikkim 3 dead, 9 soldiers missing: భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. గత నాలుగు రోజులుగు ఎడతెరిపిలేకుండా కుండపోతగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో  ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర ప్రమాదం సంభవించింది. భారీ వర్షాలకు.. ఉత్తర సిక్కింలోని ఛతేన్‌ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్‌పై మీద కొండ చరియలు విరిగిపడ్డాయి.

Add Zee News as a Preferred Source

దీంతో అక్కడున్న ముగ్గురు భద్రత సిబ్బంది స్పాట్ లోనే చనిపోయారు. మరొ తొమ్మిది మంది గల్లంతయ్యినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.

ఒక్కసారిగా భారీ వరద నీరు, పెద్ద పెద్ద రాళ్లు పడటంతో జవాన్లు ఎక్కడికి వెళ్లలో పాలుపోక.. దుర్మరణం చెందినట్లు సమాచారం. ఈ క్రమంలో అధికారులు చనిపోయిన వారి డెడ్ బాడీలను ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా మరో తొమ్మిది మంది కోసం గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

ముఖ్యంగా.. ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం చుక్కలు చూపిస్తుంది. సిక్కిం, అస్సాం, మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, మిజోరాం, నాగాల్యాండ్‌, మేఘాలయలో గత నాలుగు రోజులుగా కుండపోతగా వాన కురుస్తున్నాయి. వర్ష బీభత్సనానికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి.

Read more: Rinku Singh- Priya Saroj: మహిళా ఎంపీతో పెళ్లికి రెడీ అయిపోయిన క్రికెటర్ రింకూసింగ్.. నిశ్చితార్థం ఎప్పుడంటే..?

ఇళ్లలోకి నీరు భారీగా వచ్చి చేరుతుంది. సామాన్య జన జీవనం అంతా ఒక్కసారిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాంలో ఇప్పటి వరకు వరదల ధాటికి నలభై మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News