)
Seven died in wall collapse incident in delhi: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో జన జీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇప్పటికే పలు స్కూళ్లకు బంద్ లు సైతం ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఢిల్లీకి వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షల కారణంగా.. ఢిల్లీ లోని పలుప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. కాలనీల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో విమానాలు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి.
భారీ వర్షాల వేళ ఢిల్లీలో పెను విషాదం
కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జైత్పూర్ లో కూలిన గోడ
ప్రమాదంలో ఏడుగురు మృతి
మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు, ఇద్దరు చిన్నారులు
కొనసాగుతున్న సహాయక చర్యలు #Delhi #wallcollapse #DelhiRains pic.twitter.com/XOqyhkbVXJ
— Telugu Stride (@TeluguStride) August 9, 2025
అయితే.. ఢిల్లీలోని హరి నగర్లో ఈ ఉదయం కురిసిన భారీ వర్షానికి గోడ కూలిపోవడంతో కనీసం ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సహయక చర్యలను ముమ్మరం చేశారు. అక్కడ శిథిలాలను తొలగించే పనుల్లో పడ్డారు. ఈ క్రమంలో పలు డెడ్ బాడీల్ని పోలీసులు గుర్తించారు.
షబీబుల్ (30), రబీబుల్ (30), ముత్తు అలీ (45), రుబీనా (25), డాలీ (25), రుక్సానా (6), హసీనా (7)గా గుర్తించారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరి డెడ్ బాడీల్ని వెంటనే అంబులెన్స్ లలో పోస్ట్ మార్టంలకు తరలించారు. అయితే.. భారీ వర్షాలతో భవనం కూలి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
కానీ భవనం కూలడానికి ఖచ్చితమైన కారణాలు మాత్రం బైటకు రాలేదు. మొత్తంగా ఈ ఘటనతో ఢిల్లీలో పండగ వేళ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక, విపత్తు నిర్వాహక దళాలు, ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ప్రమాద ఘటనకు చెందిన వీడియోలు వైరల్‌గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook