Farmers Delhi Protest: ఢిల్లీ పీఠంపై వరుసగా మూడోసారి అధికారం చేపట్టి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసారు ప్రధాని నరేంద్ర మోడీ. తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పీఠం అధిరోహించిన నేతగా నరేంద్ర మోడీ కొత్త హిస్టరీ క్రియేట్ చేసారు. అయితే.. అపుడు నెహ్రూ సెలెక్టెడ్ ప్రధానిగా తొలిసారి పగ్గాలు చేపట్టి.. వరుసగా మూడు సార్లు ప్రజల ఆశీర్వాదంతో ప్రధాన మంత్రి అయ్యారు. అప్పట్లో ప్రతిపక్షం బలంగా లేకపోవడం కొన్ని కారణాల వల్ల నెహ్రూ ఎన్నికల నల్లేరుపై నడకలా  సాగింది. కానీ నరేంద్ర మోడీ  ప్రజల ఓట్లతో  బలమైన ప్రతిపక్షాలను ఎదుర్కొని వరుసగా మూడు సార్లు ప్రధాని పీఠం అధిరోహించారు. అయితే.. బీజేపీ మరియు ఆ పార్టీ మద్దతు దార్లు చెబుతున్న ప్రకారం కేంద్రంలో మూడోసారి ప్రధానిగా మోడీ రాకుడదనే ఉద్దేశ్యంతో రాకేశ్ తికాయత్ నేతృత్వంలోని రైతు సంఘాలు ధర్నా చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అపుడు వారి ఆశలు నెరవేరలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో వాళ్లు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో మరోసారి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేందుకు మళ్లీ ధర్నాకు దిగుతున్నారు. అయితే.. ఈ ఉద్యమంలో నిజమైన రైతులు ఎవరు లేరనే వాదనలు బీజేపీ వర్గాలు వినిపిస్తున్నాయి. కొంత మంది కావాలనే రైతు పేరిట నాటకాలు ఆడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంటలకు కనీస మద్ధతు ధర సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు ఆందోళన బాట పట్టాయి.


ఈ క్రమంలోనే ఈ రోజు మధ్యాహ్నం ఛలో ఢిల్లీ కార్యక్రమానికి  రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. గత శుక్రవారం రైతుల ర్యాలీ శంభు మొదలైంది. అయితే  హరియాణా పోలీసులు ర్యాలీపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి రైతులు అని చెప్పుకుంటున్న ఆందోళన కారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా 16 మంది  గాయపడ్డారు. దీంతో ర్యాలీని తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే  కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్దమని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అయినా నరేంద్ర మోడీ సర్కార్ మాత్రం ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో మళ్లీ ర్యాలీ నిర్వహించాలని డిసైడ్‌ అయ్యారు.  ఈ మేరకు 101 రైతు సంఘాలు మధ్యాహ్నం చలో ఢిల్లీ నిర్వహించాలని నిర్ణయంచారు.


ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.