Himani Narwal Mother Video: నా కూతుర్ని చంపింది కాంగ్రెస్ వాళ్లే..?.. సంచలన వ్యాఖ్యలు చేసిన హిమానీ నర్వాల్ తల్లి.. వీడియో వైరల్..

Himani narwal murder case: కాంగ్రెస్ యువ మహిళ నేత హిమానీ నర్వాల్ ను గుర్తు తెలియని దుండగులు అత్యంత క్రూరంగా హత్య చేసి సూట్ కేసులో కుక్కి పడేశారు. ఈ ఘటన హర్యానాలో సంచలనంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 2, 2025, 07:22 PM IST
  • సంచలనంగా మారిన హర్యాన యువతి హత్య కేసు..
  • తన కూతురును ఓర్వలేక దారుణమన్న తల్లి..
Himani Narwal Mother Video: నా కూతుర్ని చంపింది కాంగ్రెస్ వాళ్లే..?.. సంచలన వ్యాఖ్యలు చేసిన హిమానీ నర్వాల్ తల్లి.. వీడియో వైరల్..

Haryana Congress Himani narwal mother video viral: హర్యానాలోని రోహ్ తక్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయకురాలిని గుర్తు తెలియని దుండగులు మెడ పిసికి, అత్యంత దారుణంగా హతమార్చి.. సూట్ కేసులో కుక్కి సప్లా బస్టాండ్  సమీపంలో పడేశారు. పెద్దగా ఉన్న సూట్ కేసును చూసి బాంబు అని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి.. సూట్ కేసును తెరిచి చూడగా.. హిమానీ నర్వాల్ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు శవాన్ని పోస్టు మార్టంకు తరలించారు.

Add Zee News as a Preferred Source

ఈ ఘటన హర్యానాలో సంచలనంగా మారింది. దీనిపై  ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. తాజాగా.. ఈ ఘటనపై హిమానీ నర్వాల్ తల్లి సవితా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు చాలా ఏళ్లనుంచి కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేస్తుందని చెప్పింది. అంతే కాకుండా.. రాహుల్ గాంధీ భారత్ జోడో కార్యక్రంలో కూడా తాను యాక్టివ్ గా పాల్గొందని చెప్పుకొచ్చింది.

 

తన కూతురు కాంగ్రెస్ లో ఎదుగుదలను చూసి.. ఓర్వలేక పార్టీ వారు లేదా స్నేహితులు చంపేసి ఉండొచ్చని కూడా ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఇంత చిన్న వయసులో రాహుల్ గాంధీ వరకు వెళ్లిందని ఓర్చుకోలేక హత్య చేసి ఉండొచ్చని కూడా చెప్పింది. పదేళ్ల నుంచి తన ఇంటిని, పర్సనల్ లైఫ్ ను వదిలేసి పార్టీకోసం పాటు పడిందని తల్లి కన్నీళ్లు పెట్టుకుంది.

తన కూతురు ఎల్లప్పుడు.. దీపేందర్ హుడా భార్య ఆశా హుడాతో సన్నిహితంగా ఉండేదని చెప్పింది. తన కొడుకును సైతం.. గతంలో 2011 లో హత్యచేశారని ఇప్పటి వరకు తనకు ఆ ఘటనలో న్యాయం జరగలేదన్నారు.

ఇప్పుడు తన కూతుర్ని పొట్టన పెట్టుకున్నారని హిమానీ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. తన కూతుర్ని చంపిన వాళ్లను అరెస్టు చేసే వరకు తన కూతురి అంతిమ సంస్కారాలు చేసేది లేదని స్పష్టం చేసింది.

Read more: Manav Sharma Wife Video: ప్రియుడితో శారీరకంగా కలిశా.. షాకింగ్ నిజాలు బైటపెట్టిన టీసీఎస్ ఉద్యోగి భార్య.. వీడియో వైరల్..

అంతే కాకుండా.. ఈ ఘటన తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు తమను ఓదార్చడానికి గానీ, పరామర్శకు కానీ రాలేదని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. తన కూతురు కాంగ్రెస్ కోసం తన జీవితం ధారపోసిందని.. ఈ విధంగా తను విగత జీవిగా మారుతుందని అనుకోలేదని హిమానీ నర్వాల్ తల్లి సవిత సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News