Video: పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తుండగా కుప్పకూలిన రూఫ్‌.. పరిస్థితి విషమం డ్రోన్ విజువల్ వైరల్‌..!

Horrifying Roof Collapse Video: పెళ్లి వేడుక విషాదంగా మారింది. ఒక్కసారిగా రూఫ్‌ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి వేడకలో డ్యాన్స్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. నెట్టింటా దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది..

Written by - Renuka Godugu | Last Updated : Dec 9, 2025, 12:52 PM IST
Video: పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తుండగా కుప్పకూలిన రూఫ్‌.. పరిస్థితి విషమం డ్రోన్ విజువల్ వైరల్‌..!

Horrifying Roof Collapse Video: పెళ్లి వేడుకలో డ్యాన్స్‌ చేయడం, వేడుకగా జరుపుకోవడం చేస్తూ ఉంటాం. పెద్ద ఎత్తున చుట్టాలు, బంధువులు రావడం పెద్ద ఎత్తున డ్యాన్స్‌ చేస్తూ ఉండటం సాధారణం.  ఆ సమయంలో ఏదైనా అనుకోని ఘటన జరిగితే బాధకరం. హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో అందరూ డ్యాన్స్‌ చేస్తూ నిమగ్నమవ్వగా ఒక్కసారిగా రూఫ్‌ కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడ అందరూ రూఫ్‌పై కూర్చొని పెళ్లి డ్యాన్స్‌ వేడుకలు చూస్తున్నారు. ఆసమయంలోనే ఊహించని ఘటన జరిగింది. ఈ నెల 6వ తేదీన ఓ ఇంటి ముందు పెళ్లి డ్యాన్స్‌  చేస్తుండగా.. మరో ఇంటిపై కొందరు ఎక్కి కూర్చొని చూస్తూ నిమగ్నమైపోయారు. ఈ ఘటనలో 28 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు.. కాన,ఈ కేవలం కర్రలతో రూఫ్‌ నిర్మించినందుకే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. అయితే, తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన డ్రోన్‌ విజువల్స్‌ నెట్టింటా వైరల్‌ అవుతున్నాయి.

Add Zee News as a Preferred Source

హిమాచల్‌ ప్రదేశ్‌ సబ్‌ డివిజన్‌ చురాలో గ్రామ పంచాయితీ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇక గాయపడిన వారిని వెంటనే చంబా మెడికల్‌ కాలేజీకి తరలించారు. అయితే, అధికారుల సమాచారం మేరకు అక్కడ 40 మంది ఉన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామం అంతా ఉలిక్కపడింది. కెపాసిటీకి మించి కూర్చోవడమే ప్రమాదానికి అసలు కారణమని సమాచారం. అంతేకాదు మట్టితో నిర్మించిన ఇంటిపై  ఎక్కువ మంది ఉండటం వల్ల జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 28 మంది మహిళలు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వారిని తీస్సా ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలుసుకుని చంబా డిప్యూటీ కమిషన్‌ ముఖేష్‌ రెప్స్వాల్‌ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అడ్మినిస్ట్రేటీవ్‌ బృందం కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. పెళ్లి వేడుకల్లో ఇలాంటి అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. కొన్ని విషాదాన్ని సైతం నింపుతాయి. మరికొన్ని నెట్టింటా వైరల్‌ అవుతుంటాయి. 

 

 

సోషల్‌ మీడియాలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింటా హల్‌చల్‌ చేస్తుంటాయి. వీటిని చూసిన కొంతమందిని వెంటనే షేర్‌ చేస్తూ ఉంటారు. అయితే, నెట్టింటా ఈ వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. సోషల్‌ మీడియాలో దీంతోపాటు కొన్ని జంతువులు, యాక్సిడెంట్‌లకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతుంటాయి.. వీటితోపాటు ఎక్కువగా పాముల వీడియోలు కూడా వైరల్‌ అవుతుంటాయి.

ఇదీ చదవండి: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈ వారం 3 రోజులు సెలవులే..!

ఇదీ చదవండి: ఎయిర్‌టెల్‌ మైండ్‌బ్లోయింగ్‌ మంత్లీ ప్లాన్‌.. రూ.154 కే 365 రోజుల నెలవారీ వ్యాలిడిటీ ప్లాన్‌..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News