Aadhar Video: స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు ఆధార్‌కాపీ అవసరమేలేదు.. ఈ కొత్త యాప్‌ ఎలా పనిచేస్తుందో చూడండి..

Aadhar New App Video: మనం ఎక్కడికి వెళ్లినా ఆధార్‌ కార్డు తప్పనిసరి. ఫోటో కాపీ కచ్చితంగా తీసుకువెళ్లాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు ఆ కష్టాలకు చెక్‌ కొత్త ఆధార్‌ యాప్‌ వచ్చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ ఆధార్‌ను ఎక్స్‌ వేదికగా పరిచయం చేశారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకోండి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 9, 2025, 09:36 AM IST
Aadhar Video: స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు ఆధార్‌కాపీ అవసరమేలేదు.. ఈ కొత్త యాప్‌ ఎలా పనిచేస్తుందో చూడండి..

Aadhar New App Video: కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్‌ యాప్‌ను ప్రారంభించింది. ఎక్స్‌ వేధికగా కొత్త ఆధార్‌ యాప్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రారంభించారు. ఇక ఈ యాప్‌ ప్రత్యేకత ఏంటంటే దీంతో మీరు ఎక్కడికి వెళ్లినా మీ ఆధార్‌ కార్డు ఫిజిలక్‌ కాపీ తీసుకువెళ్లాల్సిన పనిలేదు. ఇది ఉపయోగించడం కూడా ఎంతో సులభం. మనం యూపీఐ చెల్లింపులు చేసినంత ఈజీ. అంతేకాదు ఈ యాప్‌ వ్యక్తిగత వివరాలను కూడా గోప్యంగా ఉంచుతుంది కూడా. అయితే, ఇది అతి త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.

Add Zee News as a Preferred Source

ఇక ఇప్పటి వరకు ఆధార్‌ ఎక్కడికీ వెళ్లినా మనతోపాటు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ యాప్‌తో ఇక ఆ అవసరం ఉండదు. మన ముఖం స్కాన్‌ చేస్తే ఆధార్‌ అన్‌లాక్‌ అయిపోతుంది. దీంతో మీ ఆధార్‌ను మీరు సులభంగా ధృవీకరించుకోగలరు. ఇది మొత్తం యాప్‌లోనే జరిగిపోతుందని కేంద్ర మంత్రి చెప్పారు.

మీ ఆధార్‌ స్కాన్‌ చేసినప్పుడు కూడా మీ వ్యక్తిగత సమాచారం లీక్‌ అవ్వదు. ఈ యాప్‌ భద్రంగా ఉంటుంది. ఇది వినియోగదారుల పూర్తి నియంత్రణలో ఉంటుంది. 

దీంతో ఎక్కడ పడితే అక్కడ ఆధార్‌ ఫోటో కాపీ మీరు ఎవ్వరికీ ఇవ్వాల్సిన పనిలేదు. హోటళ్లు, దుకాణాల్లో చెకిన్‌ అయినప్పుడు కూడా స్కాన్‌ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఈ యాప్‌ బీటా పరీక్ష దశలో ఉంది. త్వరలోనే మనకు అందుబాటులోకి రానుంది.

కేవలం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే చాలు మీ ధృవీకరణ సులభం అవుతుంది. మీతోపాటు ఫోటోకాపీ తీసుకువెళ్లాల్సిన పనిలేదు.ప్రతీది యాప్‌ చూసుకుంటుంది. ముందుగా యాప్‌లో ఫేస్‌ ఐడెంటిఫికేషన్‌తో లాగిన్‌, వెరిఫికేషన్‌ అవ్వాల్సి ఉంటుంది. దీంతో ఎవరూ మీ ఆధార సమాచారాన్ని కూడా తరామారు చేసే అవకాశం ఉండదు.

మొదటగా మీరు ప్లేస్టోర్‌ నుంచి ఈ కొత్త ఆధార్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  ఆతర్వాత కొన్ని దశలను అనుసరించి మీ ముఖాన్ని స్కాన్‌ చేసి ధృవీకరించాల్సి ఉంటుంది. దీంతో మీ సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆధార్‌ కార్డు ముఖ ప్రామణీకరణ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది.

 

 

ఇదీ చదవండి: తిరుమలలో రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. ఈ 3 రోజులు ప్రత్యేక సేవలు రద్దు..  

ఆధార్‌ కార్డు మన దేశంలో ప్రతిఒక్కరూ కలిగి ఉండాల్సిందే. ఇది పౌరుల గుర్తింపు కార్డు అని చెప్పాలి. స్కూలు అడ్మిషన్‌ నుంచి బ్యాంకు లావాదేవీలు ప్రతి ఒక్కటీ ఆధార్‌ కార్డు ఉంటేనే జరుగుతాయి. ఇప్పటికే యూఐడీఏఐ ద్వారా ఆధార్‌ కార్డులో పేరు, ఫోన్‌ నంబర్‌, ఇంటి అడ్రస్‌ వంటివి మార్పులు చేసుకునే సదుపాయం కల్పించారు.

ఇదీ చదవండి: ఎండ వేడిమిలో డిహైడ్రేషన్‌కు గురికాకుండా నీళ్లలో ఇవి కలుపుకొని తాగండి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News