పాక్ మీడియాలోనూ సిద్ధు ర్యాలీపై కథనాలు ; పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు ప్రసారం

సిద్ధు ర్యాలీలో పాక్ నినాదాలు భారత్ పరువు తీసేలా ఉన్నాయి. ఇదే అంశంపై పాక్ మీడియా వరుస కథనాలు ప్రసారం చేస్తూ భారత్ పై దుమ్మెత్తిపై పోస్తోంది

Updated: Dec 6, 2018, 07:24 PM IST
పాక్ మీడియాలోనూ సిద్ధు ర్యాలీపై కథనాలు ; పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు ప్రసారం

కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు.. పాకిస్తాన్ మీడియా చేతికి సిద్ధు ర్యాలీలోని పాక్ నినాదాల వీడియో దొరికింది. భారత్ పై దుమ్మెత్తిపోసేందుకు ఎప్పుడూ కాసుకొని  ఉండే పాక్ మీడియా ఇక ఊరుకుంటుందా. పాకిస్తాన్ జిందాబాద్ వీడియోను అదే పనిగా తెగ ప్రసారం చేస్తోంది. సిద్ధు ర్యాలీ భారత్ పరువు తీసేలా ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు

రేపు రాజస్థాన్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన సిద్ధు.. శనివారం రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు గుర్తుతెయని వ్యక్తులు పాక్ కు అనుకూల నినాదాలు చేశారు. దీన్ని సిద్ధు ఖండించకపోగా చిరునవ్వుచిందించారు. దీంతో ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

 

చేసిన తప్పుకు సిగ్గుపడాల్సింది పోయి నిజాన్ని బయటపెట్టిన జీ న్యూస్ పై పరువునష్టం దావావేస్తానని హెచ్చరిస్తూ సిద్ధు మేకబోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సిద్ధు చేసిన ఈ పనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్ని అవరసం ఉంది. జీ న్యూస్ లో కథనాలను తప్పుబట్టిన కాంగ్రెస్ అనుకూల మీడియా కూడా దీనిపై సమధానం చెప్పాల్సి ఉంది. ఇప్పటికైనా తాము చేసిన తప్పుని దేశ ప్రజల ముందు అంగీకరించి క్షమాపణలు చేప్పాలి.. లేదంటే ప్రజలే  ఓట్ల రూపంలో జవాబు చెబుతారని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.