Indian Railways: రైలు టిక్కెట్‌పై పేరు, ప్రయాణం చేసే తేదీ మార్చుకోవచ్చని మీకు తెలుసా?
Name Change On Ticket: చాలా మందికి తెలియని విషయం ఇది. మనం ఎప్పుడైనా రైలు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు రైలు టిక్కెట్లు ముందుగానే బుక్ చేసుకుంటాం. అయితే, మనం తొందర తొందరలో తేదీ లేదా పేరు తప్పుగా పడుతుంది. అయితే, దానికి టిక్కెట్ కేన్సల్ చేస్తారు. కానీ, పేరు, ప్రయాణించే తేదీ మార్చుకోవచ్చు.
Name Change On Ticket: మనం ఎప్పుడైనా ఏ యాత్రలు లేదా టూర్లకు వెళ్లాలన్న రైలు, విమానం, బస్సు మార్గాల్లో వెళ్తాం. కొంత మంది సొంత వాహనాల్లో వెళ్తారు. అయితే, మన భారత దేశంలో ఎక్కువ శాతం మంది ప్రతిరోజూ కొన్ని లక్షల మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే, రైలు ప్రయాణం చేయడానికి ముందుగానే టిక్కెట్ బుక్ చేసుకుంటాం. దీనికి ప్యాసింజర్ పేరు, ప్రయాణించే తేదీ కూడా ముందస్తుగానే నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, పొరపాటున మీరు టిక్కెట్‌పై పేరు లేదా ప్రయాణించే తేదీ తప్పుగా పడితే కంగారు పడకండి. రైలు టిక్కెట్ కేన్సల్ చేయాల్సిన పనిలేదు. ఈజీగా టిక్కెట్‌పై పేరు, ప్రయాణించే తేదీ మార్చుకునే వేసులుబాటు ఇండియన్ రైల్వే కల్సిస్తుంది.
భారత రైల్వే ప్రయాణికులకు అనేక సేవలు కల్పిస్తోంది...
ప్రయాణించే తేదీ, పేరు మార్చుకునే సదుపాయం. టిక్కెట్లను కుటుంబ సభ్యులకు కొన్ని కండీషన్లపై ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం కల్పించడం.
ఎడ్యుకేషనల్, టూర్ గ్రూపుల టిక్కెట్లు మార్చుకునే వెసులుబాటు..
అయితే, ఈ సేవలు పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
అయితే, ప్రయాణ తేదీ ప్రయాణికుల పేరు కేవలం ఆఫ్‌లైన్ బుకింగ్స్ చేసుకునే వారికి మాత్రమే సదుపాయం కల్పిస్తారు. ఆఫ్‌లైన్‌లో రిజర్వేషన్ కౌంటర్‌లో టిక్కెట్లు కొనుగోలు చేసినవారికే ఈ సదుపాయం.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారు ఈ సేవలు పొందలేరు.
ఇండియన్ రైల్వే టిక్కెట్ ట్రాన్స్‌ఫర్ సేవలు కూడా కల్పిస్తోంది. కానీ, కేవలం మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు, భాగస్వామి, పిల్లలకు మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది.
అయితే, ఎడ్యుకేషన్ టూర్స్ ప్లాన్స్ చేసినవి వారి గ్రూప్ సభ్యుల్లోని వారికి టిక్కెట్ ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం కల్పిస్తోంది.
ఇదీ చదవండి: ఈ 7 ఆహారాల్లో పాలకూర కంటే పుష్కలంగా ఐరన్ ఉంటుంది.. మీ శరీరానికి తక్షణ శక్తినిస్తాయి..
రైలు టిక్కెట్లపై ప్రయాణ తేదీ లేదా పేరు మార్చుకునే విధానం..
మీ ఇంటికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్‌లోని సిబ్బందిని కలవండి. మీరు రైలు ప్రయాణం 24 గంటల ముందు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది పేరు మార్చుకోవడనానికి, ఒక వేళ మీరు ప్రయాణ తేదీని మార్చుకోవానుకుంటే 48 గంటల ముందు మార్చుకోవాలి.
మీ ఒరిజినల్ రైలు టిక్కెట్లను కూడా మీతోపాటు తీసుకెళ్లాలి. దీనికి నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. దీంతో వారే సులభంగా మీ టిక్కెట్‌పై పేరు లేదా ప్రయాణ తేదీని మార్చేస్తారు.
ఇదీ చదవండి: చలికాలం తప్పకుండా తినాల్సిన 7 ఆహారాలు.. ఇవి మీ డైట్‌లో ఉన్నాయా సుమీ..?
ఇక ప్రయాణ తేదీ మాత్రం ఆరోజు అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా మాత్రమే కేటాయిస్తారు. ఇక పై మీరు పొరపాటున మీ పేరు, లేదా ప్రయాణ తేదీలో ఏవైనా పొరపాట్లు జరిగితే కంగారు పడాల్సిన పనిలేదు. సులభంగా దగ్గరలో ఉన్న రైలు స్టేషన్‌కు వెళ్లి సులభంగా మార్చుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.