IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం ఇది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 వరకూ గడువు ఉంది. కొన్ని టిప్స్, సూచనలు తెలుసుకుంటే ఆన్‌లైన్‌లో మీరే ఫైల్ చేయవచ్చు. ఆడిటర్ సహాయం లేకుండానే చేయవచ్చు.
ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే ప్రక్రియ ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. ఉద్యోగులకు ఫామ 16 చేతికి అందగానే రిటర్న్స్ దాఖలు చేస్తుంటారు. చాలామంది ఆడిటర్ లేదా ఎక్కౌంటెంట్ల ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేస్తుంటారు. అయితే కొన్ని టిప్స్ తెలుసుకుంటే మీరే స్వయంగా ఆడిటర్ సహాయం లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. మరో వారం రోజుల్లో ఈ ఆర్ధిక సంవత్సరం ముగియనుంది. అంటే ఏప్రిల్ నుంచి రిటర్న్స్ దాఖలు ప్రక్రియ ప్రారంభమౌతుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో చెల్లించిన ట్యాక్స్ వివరాలతో రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు. దీనికోసం పనిచేసే సంస్థ నుంచి ఫామ్ 16 కావల్సి ఉంటుంది. అదనంగా ట్యాక్స్ కట్టి ఉంటే అది రిఫండ్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐటీ రిటర్న్స్ అనేవి లోన్ ప్రోసెసింగ్, వీసా అప్లికేషన్ వంటివాటికి చాలా ఉపయోగకరం.
ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఏం కావాలి
ఫామ్16, ఫామ్ 16ఎ, ఫామ్ 26ఏఎస్, కేపిటల్ గెయిన్ స్టేట్‌మెంట్స్, ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్స్
ఐటీ రిటర్న్స్ ఆన్‌లైన్‌లో ఎలా చేయాలి
ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖకు చెందిన అధికారిక పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇ పైల్ మెనూ ఓపెన్ చేసి ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎంచుకోవాలి. ఫామ్ 16 ఆధారంగా ఫైల్ చేస్తుంటే అంటే మీరు ఉద్యోగస్థులయితే ఐటీఆర్ -1 లేదా ఐటీఆర్-2 దాఖాలు చేయాలి. అందులో ఉన్న డేటా మొత్తం వెరిఫై చేసుకుని సబ్మిట్ చేసుకోవాలి. ఆ తరువాత ఆధార్ ఓటీపీతో ఇ వెరిఫై చేసుకోవాలి. చివరిగా అప్‌లోడ్ చేసి రిటర్న్స్ వెరిఫై చేసుకోవాలి.
సెక్షన్ 80సి, సెక్షన్ 80 సిసిసి, సెక్షన్ 80సిసిడి, సెక్షన్ 80డి, సెక్షన్ 80 ఇ, 80జి, 80జీజీఏ, 80టీటీఏ ప్రకారం డిడక్షన్ లేకుండా ఆదాయ కనీస పరిమితి దాటితే తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. భారతీయుడై ఉండి విదేశాల్లో ఆస్తి కలిగి ఉంటే కూడా ఐటీఆర్ ఫైల్ చేయాలి. కనీస పరిమితి కంటే ఎక్కువ మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేసి ఉన్నా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









