How to know UAN Number: యూఏఎన్ అంటే ప్రతి పీఎఫ్ ఖాతాకు కేటాయించే యూనివర్శన్ ఎక్కౌంట్ నెంబర్. ఇది 12 అంకెల్లో ఉంటుంది. ఉద్యోగి నెల జీతం నుంచి ప్రతి నెలా కొంత డబ్బు పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంటుంది. కొద్ది మొత్తం ఉద్యోగి పనిచేసే సంస్థ నుంచి జమ అవుతుంది. ఏడాదికోసారి పీఎఫ్ డబ్బులపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ అందిస్తుంటుంది.
ఎప్పుడైనా పీఎఫ్ విత్ డ్రా చేయాల్సి వచ్చినా లేక పీఎఫ్ డబ్బులు బ్యాలెన్స్ చెక్ చేయాల్సిన వచ్చినా లేక పీఎఫ్ ఎక్కౌంట్ నామినీ ఫిక్స్ చేసేందుకు లేదా పీఎఫ్ ఎక్కౌంట్‌కు సంబంధించిన ఏ పనైనా సరే యూఏఎన్ నెంబర్ తప్పనిసరి. మొబైల్ నెంబర్ మార్చాల్సి వచ్చినా యూఏఎన్ నెంబర్ అవసరం. సాధారణంగా యూఏఎన్ నెంబర్ అనేది పే స్లిప్‌పై ఉంటుంది. ఒక్కోసారి యూఏఎన్ నెంబర్ మర్చిపోతుంటాం. మీరు కూడా మీ యూఏఎన్ నెంబర్ మర్చిపోయుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా ఆన్‌లైన్ విధానంలో తిరిగి తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా తిరిగి పొందవచ్చు.
ఆన్‌లైన్‌లో యూఏఎన్ నెంబర్ తెలుసుకోవడం ఎలా
ముందుగా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు అక్కడ కన్పించే ఇంపార్టెంట్ లింక్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత నో యువర్ యూఏఎన్ ఆప్షన్ క్లిక్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. చివరిగా యూఏఎన్ నెంబర్‌పై క్లిక్ చేస్తే మీ నెంబర్ స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతుంది.
ఇలా ఆన్‌లైన్‌లో కాకుండా ఎస్ఎంఎస్ ద్వారా కూడా యూఏఎన్ నెంబర్ తెలుసుకోవచ్చు. దీనికోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే చాలు కాస్సేపట్లు మీ యూఏఎన్ నెంబర్ మీ మొబైల్ నెంబర్‌కు వస్తుంది.
Also read: TDP Silent: పవన్ మాటలపై తెలుగుదేశం మౌనం, హై కమాండ్ ఆదేశాలేంటి, కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









