Aadhaar Card Update: ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ అనేది చాలా ముఖ్యమైంది. కీలకమైన పనులకు ఇది చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వ, ప్రైవేటు పనులు యూఐడీఏఐ జారీ చేసే 12 అంకెల ఐడీ చాలా కీలకమైంది. ఆధార్ కార్డులో వివరాలు ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ఈనెల 14 వరకే సమయం ఉంది.
ఆధార్ కార్డులో అడ్రస్ వంటి వివరాలను ఇంట్లోంచే సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ నెల 14 వరకు ఉచితంగా చేసుకునేందుకు వీలుంది. ఈ నెల 14 దాటితే మాత్రం నిర్ణీత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకునేందుకు ముందుగా మై ఆధార్ పోర్టల్ ఓపెన్ చేయాలి. ఆ తరువాత మీ 12 అంకెల ఆధార్ నెంబర్, క్యాప్చా, కోడ్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీటీ వస్తుంది. అది నమోదు చేయాలి. ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ నుంచి అడ్రస్ ఛేంజ్ మార్పు ఆప్షన్ ఎంచుకోవాలి.
అడ్రస్ వివరాలు మార్చేందుకు పాస్‌పోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్, రేషన్ కార్డు, ఓటరు ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి నిర్ణీత పరిమాణంలో అప్‌లోడ్ చేయాలి. ప్రతి డాక్యుమెంట్ సైజు 2ఎంబీలోగా, జేపీఈజీ ఫార్మట్‌లో ఉండాలి. అన్ని వివరాలు ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే చాలు. మీ అడ్రస్ అప్‌డేట్ అవుతుంది.
Also read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook









