Waiting List: రైల్వే వెయిటింగ్‌ లిస్ట్‌ .. ఏ టిక్కెట్స్‌ ఎక్కువ కన్ఫర్మ్‌ అవుతున్నాయి తెలుసా?

How Rail Waiting List Ticket Confirmed: దేశంలో ఎక్కువ శాతం మంది రైలు ద్వారా ప్రయాణం చేస్తారు. ఎందుకంటే టికెట్ రేటు తక్కువగా ఉండటంతో పాటు సుదీర్ఘ ప్రయాణం సులభంగా చేయవచ్చు. అయితే ఈ రిజర్వేషన్ రైలులో హాయిగా ప్రయాణం చేయాలంటే మూడు నెలలు ముందుగానే సీటు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా తత్కాల్ టికెట్ బుకింగ్ కూడా ఉంటుంది. అయితే ఒక్కోసారి హఠాత్తుగా రైలు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. అయితే కొన్ని సమయంలో అది కూడా కన్ఫర్మ్‌ కాకుండా పోతుంది. అయితే వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ కావాలంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Dec 6, 2025, 11:15 AM IST
Waiting List: రైల్వే వెయిటింగ్‌ లిస్ట్‌ .. ఏ టిక్కెట్స్‌ ఎక్కువ కన్ఫర్మ్‌ అవుతున్నాయి తెలుసా?

How Rail Waiting List Ticket Confirmed: మన భారతీయ రైల్వే అతిపెద్ద రవాణా వ్యవస్థ. రోజుకు కొన్ని లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. తక్కువ ధరలో సుదూర ప్రాంతానికి ఇది చేరుస్తుంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణం ఎంచుకుంటారు. అయితే సడన్ నా రైలు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ముందుగానే టికెట్స్ బుక్ అయిపోయినప్పుడు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే కొన్ని ట్రిక్స్ పాటిస్తే సులభంగా వెయిటింగ్ లిస్టు టికెట్స్ కూడా మనకు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. రైల్వేలో స్లీపర్‌, 3 ఏసి, సెకండ్ AC, 1ఎసి లో కూడా వెయిటింగ్ లిస్టు RAC ఉంటాయి. RAC ద్వారా రైలు ప్రయాణం కూడా చేయవచ్చు. అయితే వెయిటింగ్ లిస్టు విషయానికి వస్తే ఒక్కోసారి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. లేకపోతే కన్ఫర్మ్ కాకపోవచ్చు. అయితే ఎలాంటి సందర్భంలో టికెట్ కన్ఫర్మ్ అవుతుందో ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

 రైల్వే లో ప్రతి క్లాసులో 25% కి మించిన వెయిటింగ్ లిస్టు టికెట్స్ ఉండవు. అంటే ఒక ట్రైన్ కోచ్ లో 100 సీట్లు ఉంటే అందులో కేవలం 25 శాతం సీట్లు మాత్రమే వెయిటింగ్ లిస్టులో కేటాయిస్తారు. ప్రధానంగా ఇది మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ రైల్వే టికెట్లు బుకింగ్ సంబంధించి అనేక యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు టికెట్స్ కన్ఫర్మ్ అయిపోతాయి అని అవి తెలుపుతాయి. అయితే నిజానికి రైల్వే టికెట్ కన్ఫర్మ్ కావాలంటే కొన్ని ట్రిక్స్ తెలుసుకోండి.

 రైల్ టికెట్ కన్ఫర్మేషన్ ఫార్ములా..
 భారతీయ రైల్వే ప్రకారం టికెట్స్ బుక్ చేసుకున్న 20 శాతం మంది రైలు ప్రయాణికులు క్యాన్సల్ కూడా చేసుకుంటారు. అందులో నాలుగు ఐదు శాతం మంది టికెట్ బుక్ చేసుకున్నా కానీ ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎమర్జెన్సీ కోటాలో కేటాయిస్తారు. దీంతో పాటు వెయిటింగ్ లిస్టుకు సంబంధించిన 25% సీట్లు. ఇవి రెండూ కలిపి కేటాయిస్తారు. ఉదాహరణకు ఒక స్లీపర్ కోచ్ లో 72 సీట్స్ ఉంటే 25% (WL) ఖాళీగా ఉంచుతారు. ఎమర్జెన్సీ కోటా రెండు కలిపి 18 సీట్లు మిగులుతాయి. అలా అంటే మొత్తంగా 18 సీట్లను వెయిటింగ్ లిస్టులో కన్ఫర్మ్ అయిపోతుంది. ఇది స్లీపర్ కోచ్‌కు మాత్రమే వర్తిస్తుంది.

టికెట్ బుక్ చేసుకున్న సమయంలో రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ అని కనిపిస్తుంది. అంటే తక్కువ దూరం ప్రయాణం చేసే ట్రావెలర్ టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు మాత్రమే.. ఆ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇది కాకుండా జనరల్ వెయిటింగ్ లిస్టు రిజర్వేషన్ వి కూడా ఉంటాయి. అది జనరల్ నుంచి రిజర్వేషన్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఇది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.

అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ లో టికెట్ ధర పూర్తిగా చెల్లించిన కన్ఫర్మేషన్ రాదు. కానీ టికెట్ కచ్చితంగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది . రైలు బయలుదేరే అరగంట ముందు వరకు టికెట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఆ టికెట్స్ అన్నీ వెయిటింగ్ లిస్టులోకి వెళ్తాయి. వెయిటింగ్ ఆ ప్రయాణికులకు ఈ టికెట్లను కేటాయిస్తారు. అరగంట ముందుగా క్యాన్సల్ చేస్తేనే రిఫండ్ కూడా లభిస్తుంది. తరచుగా పెద్ద సంఖ్యలో టికెట్లు రద్దు చేసుకున్న రైలులు ఉంటాయి. అయితే సీజన్ ని బట్టి కూడా ఇది మారే అవకాశం ఉంది. కొన్ని నెలల్లో ఎక్కువ వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి కేటాయిస్తారు.

Read more: వ్లాదిమిర్‌ పుతిన్‌కు మోదీ ఇచ్చిన అమూల్యమైన కానుకలు.. చైనా ఏమన్నదంటే?

Read more: మహిళలకు భారతీయ రైల్వే భారీ గుడ్‌న్యూస్‌.. అవి ఆటోమెటిక్‌గా వారికే కేటాయింపు..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News