)
Huma Qureshi Brother Murder: బాలీవుడ్ నటి హుమా ఖురేషి సోదరుడు ఆసిఫ్ ఖురేషీ దారుణ హత్యకు గురయ్యాడు. ఢిల్లీలో నిన్న రాత్రి తన సొంత ఇంటి వద్ద ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా పార్కింగ్ విషయంలో పక్కింటి వారితో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో రాత్రి కూడా పార్కింగ్ విషయంలో యువకులతో వివాదం తలెత్తడంతో వాళ్ళు ఒక్కసారిగా పదునైన ఆయుధాలతో ఆసిఫ్ పై దాడి చేశారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక మృతుడి భార్య వివరాల ప్రకారం చిన్న విషయంలో వివాదం తలెత్తి ఇలా హత్యకు దారితీసింది. తన భర్త పార్కింగ్ వివాదం విషయంలో గొడవపడ్డారని రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో పొరుగువారి స్కూటీ ఇంటి ముందే నిలిపి ఉంది. దాన్ని తీయమని అడిగినందుకే వివాదం తలెత్తింది. వాళ్ళ దుర్భాష లాగడటం ప్రారంభించారు. పదునైన వస్తువును తెచ్చి కూడా దాడి చేశారు అని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతేకాదు కొన్ని రోజులుగా పార్కింగ్ విషయంలో వివాదం తలెత్తుతుంది. ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారని మృతుడి బంధువులు కూడా ఆరోపించారు. గతంలో కూడా రెండు మార్లు ఆసీస్ పై దాడి చేశారని వాళ్ళు చెప్పారు.
అసీఫ్ ఇల్లు నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జంగ్పూర్ బజార్ లేన్‌లో ఉంది. గురువారం రాత్రి పార్కింగ్ వివాదంలో ఈ సంచలన హత్య జరిగింది. పార్కింగ్ వివాదం కారణంగానే కేవలం అతడు ప్రాణాలు తీశారు. రాత్రి 11 గంటల సమయంలో గేటు ముందున్న స్కూటర్ తీయమన్నందుకే వివాదం జరిగిందని పోలీసులు కూడా తెలిపారు. వెంటనే ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక హుమా ఖురేషీ పలువురు బాలీవుడ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కాలా రజనీకాంత్ సినిమాలో కూడా ఆమె నటించారు. బద్లాపూర్ ,ఇష్కియా, జానీ LLB2 తదితర చిత్రాల్లో కూడా హుమా నటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook