)
Hyderabad To Chennai Bullet Train Route: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్. ఇప్పటి వరకు బుల్లెట్ రైలు అంటే అటు చైనా లేదా ఇటు జపాన్ వైపు తిరిగి చూడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు బుల్లెట్ రైలు మన భారతదేశం.. మన తెలుగు రాష్ట్రాలకు రాబోతుంది. ఈ బుల్లెట్ రైలు ప్రారంభమైతే హైదరాబాద్ నుంచి తిరుపతికి కేవలం 2 గంటల్లో వెళ్లొచ్చు.
అదెలాగంటే హైదరాబాద్ - చెన్నై మధ్య ఓ బుల్లెట్ రైలు ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీసుకురానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నుంచి చెన్నైకి కేవలం 2 గంటల 20 నిమిషాల్లో చేరుకోవచ్చని అంచనా. ఇదే విషయమై తమిళనాడు సర్కారు తుది అలైన్మెంట్ నివేదికను కూడా సమర్పించారు. అయితే తొలుత హైదరాబాద్ నుంచి చెన్నైకి నాన్‌స్టాప్ గా నడవనున్నట్లు ప్రతిపాదించారు. కానీ, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో హాల్టింగ్ ఉండాలనే విధంగా ప్రతిపాదన వచ్చింది. ఈ బుల్లెట్ ప్రాజెక్టుకు 223.44 హెక్టార్ల భూమి అవసరమని ప్రాథమిక అంచనా వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణకు వేగం పెంచాలని భారతీయ రైల్వే శాఖ కోరింది.
ఈ బుల్లెట్ ట్రైన్ ఇంటర్ సిటీ ప్రయాణంలో సరికొత్త విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాలంటే ప్రస్తుతం రైలు ప్రయాణంలో 12 గంటలు పడుతుంది. ఈ సరికొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టు ద్వారా కేవలం 2.20 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
తిరుపతిలో హాల్టింగ్..
తమిళనాడు ప్రభుత్వం కోరిక ప్రకారం గతంలో ఉన్న ప్రణాళిక ప్రకారం ట్రైన్ గూడూరు మీదుగా వెళ్లాల్సి ఉంది. తాజాగా తిరుపతి స్టేషన్ మీదుగా ట్రైన్ ప్రయాణించే విధంగా మార్పులు చేయాలని అనుకున్నారు. అయితే తమిళనాడు రాష్ట్ర పరిధిలో మొత్తం రెండు స్టేషన్ల పేర్లను ప్రతిపాదించారు. చెన్నై సెంట్రల్, చెన్నై రింగు రోడ్డు స్టేషన్ హాల్టింగ్ కోసం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వాణిజ్య, రవాణాలతో పాటు ఇతర అవసరాల కోసం దాదాపుగా 50 స్థలాన్ని కావాలని భారతీయ రైల్వే శాఖ కోరినట్లు సమాచారం.
12 కి.మీ. టన్నెల్..
ఈ ప్రాజెక్టు నివేదికపై సెంట్రల్ ప్రభుత్వ ఆమోదం లభించిన నెలలోపు తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చెన్నై యూనిఫైడ్ మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ స్పష్టం చేసింది. అంతేకాకుండా తమిళనాడు పరిథిలో 12 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం ఉందనుందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు కోసం చేయనున్న భూసేకరణలో ఎలాంటి అటవీ భూమి లేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా ఈ రూటులో 65 రోడ్లు, 21 హైటెన్షన్ విద్యుత్ లైన్లను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో ఈ బుల్లెట్ ప్రాజెక్టు కింద రెండు మార్గాలను రెడీ చేయనున్నారు. అందులో హైదరాబాద్- చెన్నై మార్గంతో పాటు హైదరాబాద్ - బెంగళూరు కారిడార్‌ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్ ముందుకు సాగాలంటే భూసేకరణపై జాప్యాన్ని నివారించేందుకు త్వరగా భూసేకరణను ఖరారు చేయాలని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook