ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాలు కోసం ఎదురుచూసే వారు తప్పనిసరిగా చేసే ప్రయత్నంగా ఐబీపీఎస్ పరీక్షలు రాస్తారు. వచ్చే ఏడాదికిగానూ నిర్వహించనున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆర్ఆర్‌బీ, క్లర్క్, పీవో ప్రధాన పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఎప్పటిలాగే ఐబీపీఎస్ అధికారిక వెబ్‌‌సైట్‌లో పరీక్షల తేదీలు (IBPS Exam Schedule) వివరాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకోవాలని సూచించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 Also Read : Telangana Jobs: ఏఆర్‌టీ సెంటర్లలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ 


 


ఐబీపీఎస్ షెడ్యూలు (IBPS Exam Dates) ప్రకారం  జనవరి 30, 2021న ఆర్‌ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పరీక్ష ఫిబ్రవరి 20న, ప్రొబెషనరీ ఆఫీసర్ పరీక్ష ఫిబ్రవరి 4న, క్లర్క్ ప్రధాన పరీక్ష ఫిబ్రవరి 28న నిర్వహించనున్నట్లు ఐబీపీఎస్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది.


ఐబీపీఎస్ ఎగ్జామ్ షెడ్యూల్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
 


ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులకు సంబంధించి ఆఫీసర్ పోస్టులు, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల షెడ్యూల్ ఖరారైంది. వీటితోపాటు CRP RRB IX మెయిన్ ఎగ్జామ్స్, పీవో మెయిన్ ఎగ్జామ్స్, క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల వివరాలు వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు.


ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ (IBPS Official Website)


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe