ICAI CA Inter Foundation Results 2025: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ ఎక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫౌండేషన్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి నెలల జరిగిన ఈ పరీక్షల్లో దేశవ్యాప్తంగా కేవలం 14.05 శాతమే ఉత్తీర్ణత సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు మొదటి రెండు ర్యాంకులు కైవసం చేసుకోవడం గమనార్హం.
ఐసీఏఐ నిర్వహించిన సీఏ ఇంటర్, ఫౌండేషన్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్ధులు icai.nic.in ద్వారా తమ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. స్కోర్ కార్డు, మెరిట్ జాబితా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీఏ రెండు గ్రూపులకు సంబంధించి మొత్తం 48,261 మంది పరీక్షలు రాయగా 6781 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే దేశవ్యాప్తంగా కేవలం 14.05 శాతమే ఉత్తీర్ణులయ్యారు. గ్రూప్ 1 పరీక్షలను 1,08,187 మంది రాయగా 15,332 మంది క్వాలిఫై అయ్యారు. గ్రూప్ 2 పరీక్షలను 80,368 మంది రాయగా 17,813 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఫౌండేషన్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా 21.52 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
సీఏ ఇంటర్ 2025 పరీక్ష ఫలితాల్లో హైదరాబాద్ అమ్మాయి దీపాన్షి అగర్వాల్ 86.63 శాతం మార్కులతో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ కైవసం చేసుకుంది. అటు విజయవాడకు చెందిన తోట సోమనాథ్ శేషాద్రి నాయుడు 86 శాతం మార్కులతో రెండవ ర్యాంకు సాధించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సర్దాక్ అగర్వాల్ 85.83 శాతం మార్కులతో మూడో ర్యాంకు దక్కించుకున్నాడు.
ఐసీఏఐ సీఏ పరీక్ష ఫలితాలు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ముందుగా అధికారిక వెబ్‌సైట్ icai.nic.in ఓపెన్ చేయాలి. ఇప్పుడు హోమ్ పేజీలో కన్పించే ICAI CA January 2025 Results క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..స్క్రీన్‌పై ఫలితాలు ప్రత్యక్షమౌతాయి.
Also read: OTT Movies: తండేల్, మనమే సహా ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









