Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్ రేపు మార్చ్ 4వ తేదీన ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరగనుండగా రెండవ సెమీఫైనల్ దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. న్యూజిలాండ్‌పై 44 పరుగుల విజయంతో సెమీస్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఖరారు చేసుకున్న భారత్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమౌతోంది.
వాస్తవానికి న్యూజిలాండ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా కేవలం 250 పరుగుల లక్ష్యాన్నే ఉంచగలిగింది. దుబాయ్ డెడ్లీ పిచ్‌పై అంతకంటే ఎక్కువ పరుగులు రాబట్టలేకపోయింది. కానీ ఆ తరువాత భారత స్పిన్నర్ల మాయాజాలానికి న్యూజిలాండ్ చేతులెత్తేసింది. 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. వరుణ్ చక్రవర్తి అద్భుతమైన స్పిన్‌తో 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా శ్రేయస్ అయ్యర్ 79 పరుగులతో ఆదుకున్నాడు. వరుస మూడు మ్యాచ్‌ల విజయంతో గ్రూప్ ఎ టాపర్‌గా ఇండియా నిలిచింది. అటు గ్రూప్ బిలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ జట్లతో జరగాల్సిన మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో ఆస్ట్రేలియా 4 పాయింట్లే దక్కించుకుంది.
ఇండియా ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ రికార్డులు
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఆస్ట్రేలియా జట్లు నాలుగు సార్లు తలపడగా రెండు సార్లు ఇండియా గెలిచింది. ఒక మ్యాచ్ ఆసీస్ విజయం సాధించింది. మరో మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ఢాకాలో 44 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించగా, నైరోబీలో 20 పరుగుల తేడాతో గెలిచింది.
ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 151 వన్డేలు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియాదే పైచేయిగా ఉంది. టీమ్ ఇండియా 57 మ్యాచ్‌లలో విజయం సాధించగా ఆస్ట్రేలియా 84 మ్యాచ్‌లు గెలిచింది. దుబాయ్ పిచ్ పూర్తిగా బౌలింగ్ అనుకూలమైన పిచ్. భారీ స్కోర్లు సాధ్యం కాదు. మొదట బ్యాటింగ్ చేసి సాధ్యమైనంత భారీ టార్గెట్ ఉంచగలిగితే టీమ్ ఇండియాకు విజయావకాశాలు ఉంటాయి.
Also read: Champions Trophy 2025: వన్డే ప్రపంచకప్ 2023 ప్రతీకారం తీర్చుకోనుందా టీమ్ ఇండియా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









