Ind vs NZ Match: ఇండియా న్యూజిలాండ్ హెడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ ఇలా

Ind vs NZ Match: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ చివరి లీగ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. హ్యాట్రిక్ విజయం, టేబుల్ టాప్ కోసం ఇండియా ప్రయత్నించనుంది. సెమీస్ బెర్త్ ఖరారు కావడంతో భారత జట్టులో కొన్ని మార్పులు కచ్చితంగా కన్పించనున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2025, 01:11 PM IST
Ind vs NZ Match: ఇండియా న్యూజిలాండ్ హెడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ ఇలా

Ind vs NZ Match: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో ఇండియా ఇవాళ కివీస్‌తో తలపడనుంది. రన్‌రేట్ కారణంగా అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ను దాటాలంటే ఇండియా ఇవాళ్టి మ్యాచ్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది. భారీ స్కోర్లకు ఏ మాత్రం అనువుగా లేని డెడ్లీ పిచ్ పూర్తిగా స్పిన్నర్లకే అనుకూలంగా ఉంటుంది. దుబాయ్ పిచ్ రిపోర్ట్, ఇండియా న్యూజిలాండ్ హెడ్ టు హెడ్ రికార్డుల గురించి పరిశీలిద్దాం

Add Zee News as a Preferred Source

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రెండు గ్రూపుల నుంచి సెమీస్ జట్లు ఖాయమయ్యాయి. గ్రూప్ ఎ నుంచి ఇండియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ చేరితే, గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు ఉన్నాయి. అయితే ఏ జట్టు ఎవరితో సెమీస్ తలపడుతుందనేది ఇవాళ జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌తో తేలనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా - న్యూజిలాండ్ దేశాలు తొలిసారి తలపడుతున్నాయి. యూఏఈ, షార్జా వేదికలపై ఇండియా న్యూజిలాండ్ మద్య ఐదు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో నాలుగింట టీమ్ ఇండియా, ఒకటి న్యూజిలాండ్ గెలిచాయి. రెండు జట్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై గెలిచి పటిష్టంగా కన్పిస్తున్నాయి. రన్ రేట్ పరంగా న్యూజిలాండ్ కాస్త ఆధిక్యంలో ఉంది. 

టీమ్ ఇండియా సెమీస్ బెర్త్ ఖరారు కావడంతో ఈ మ్యాచ్ ఒకటి రెండు మార్పులకు అవకాశం ఉంది. ముఖ్యంగా గాయాలతో బాధపడుతున్న రోహిత్ శర్మ, మొహమ్మద్ షమీకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఈ ఇద్దరి స్థానంలో రిషభ్ పంత్, అర్షదీప్ సింగ్ ఆడవచ్చు. అదే జరిగితే కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయవచ్చు. ఇక రిషభ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. 

ఇండియా న్యూజిలాండ్ హెడ్ టు హెడ్ రికార్డులు

ఇప్పటి వరకూ వన్డేల్లో టీమ్ ఇండియా ఆధిక్యంలో ఉంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 118 వన్డేలు జరగగా 60 మ్యాచ్‌లలో భారత్ విజయం సాధిస్తే 50 వన్డేలు కివీస్ గెలిచింది. 7 మ్యాచ్‌లు ఫలితం లేకపోగా ఒక మ్యాచ్ టై అయింది. ఇండియాతో న్యూజిలాండ్ ఆడిన గత 5 మ్యాచ్‌లలో ఇండియానే విజయం సాధించింది. ఇవాళ్టి మ్యాచ్ టీమ్ ఇండియా గెలిస్తే సెమీస్ ఆస్ట్రేలియాతో తలపడవచ్చు. 

దుబాయ్ పిచ్ రిపోర్ట్

దుబాయ్ వాతావరణం వెచ్చగా ఉంటుంది. పొడి గాలులు వీస్తాయి. వర్షం పడే సూచన దాదాపుగా లేదు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండవచ్చని అంచనా ఉంది. పేస్ బౌలింగ్, బౌన్స్‌కు పిచ్ అనుకూలంగా ఉంటుంది. 

Also read: AP Summer Effect: ఈ వేసవి చాలా హాట్, తీవ్రంగా వడగాల్పులు, 48 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News