Terror Attack Alert: ఛాంపియన్స్ ట్రోఫీకు ఉగ్రవాదుల ముప్పు హై అలర్ట్ జారీ టార్గెట్ ఎవరో తెలుసా

Terror Attack Alert in Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సంబంధించి కీలకమైన వార్నింగ్ జారీ అయింది. టోర్నీకు హాజరయ్యే విదేశీయులు ఉలిక్కి పడే వార్త ఇది. అందరికీ ప్రాణ ముప్పు పొంచి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2025, 04:42 PM IST
Terror Attack Alert: ఛాంపియన్స్ ట్రోఫీకు ఉగ్రవాదుల ముప్పు హై అలర్ట్ జారీ టార్గెట్ ఎవరో తెలుసా

Terror Attack Alert in Champions Trophy: పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లకు సీరియస్ వార్నింగ్ ఇష్యూ అయింది. టోర్నీలో పాల్గొనే విదేశీయుల్ని కిడ్నాప్, హత్యకు కుట్ర జరుగుతుందనేది ఈ హెచ్చరిక. ఇది జారీ చేసింది స్వయంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో కావడం గమనార్హం. 

Add Zee News as a Preferred Source

దాదాపు 29 ఏళ్ల తరువాత పాకిస్తాన్‌లో ఐసీసీ టోర్నీ జరుగుతోంది. ఇండియా సహా 8 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీ కోసం పాకిస్తాన్‌కు వెళ్లేందుకు ఇండియా నిరాకరించడంతో టీమ్ ఇండియా మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లకు ముప్పు పొంచి ఉందని హెచ్చరిక జారీ అయింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్వయంగా ఈ వార్నింగ్ ఇష్యూ చేసింది. టోర్నీలో పాల్గొనే విదేశీయుల్ని ముఖ్యంగా అరబ్, చైనా దేశస్థుల్ని కిడ్నాప్ , హత్య చేసే కుట్ర జరిగిందని పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఐఎస్‌కేపీ అనే ఉగ్రవాద సంస్ద టోర్నీలో పాల్గొనే విదేశీయుల్ని కిడ్నాప్ చేసే ప్రమాదముందని తెలిపింది. టోర్నీ మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే విదేశీయుల్ని కిడ్నాప్ చేసేందుకు యాక్టివ్ కోవర్ట్ గ్రూపులు కుట్ర పన్నుతున్నాయని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వద్ద సమాచారం ఉంది. అందుకే భద్రతా బలగాలను హెచ్చరిస్తూ హై అలర్ట్ జారీ చేసింది. 

కిడ్నాప్ చేసినవారికోసం మ్యాచ్‌లు జరుగుతున్న ప్రాంతాల్లోనే ప్రత్యేక గదులు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ విషయంలో పాకిస్తాన్ సామర్ధ్యం ఈ హెచ్చరికలతో మరోసారి బయటపడింది. ఎందుకంటే గతంలో 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టు పర్యటిస్తుండగా ఆ జట్టు సభ్యులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అటు ఆప్ఘనిస్తాన్ ఇంటెలిజెన్స్ కూడా ఇలాంటి హెచ్చరికే జారీ చేయడంతో ఆందోళన వ్యక్తమౌతోంది. 

విదేశీయుల కిడ్నాప్ లేదా హత్య కోసం ఇప్పటికే పోర్టులు, విమానాశ్రయాలు, ఆఫీసులు, నివాస ప్రాంతాలపై ఉగ్రవాద సంస్థలు నిఘా వేశాయని పాక్ ఇంటెలిజెన్స్ తెలిపింది. 

Also read: Champions Trophy 2025: పాక్‌కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయా, ఇలా జరిగితేనే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News