కరోనావైరస్ (Coronavirus) వ్యాపించకుండా ఒకరికొకరు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం విధించిన లౌక్‌డౌన్‌కు (Lockdown) మద్దతుగా ఐసిఐసిఐ బ్యాంక్ (ICICI bank) వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అవును ఇప్పటివరకు మొబైల్ బ్యాంకింగ్ (Mobile banking), ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet banking) సేవలు చూసినట్టుగానే ఐసిఐసిఐ బ్యాంక్ కొత్తగా వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిందన్నమాట. 21 రోజుల లాక్ డౌన్ సమయంలో బ్యాంకింగ్ అవసరాల కోసం బ్యాంకుకి వెళ్లలేకపోతున్నామనే కారణంగా ఖాతాదారులు అసౌకర్యానికి గురికాకూడదనే ఉద్దేశంతోనే వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ (Whatsapp banking) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఐసిఐసిఐ పేర్కొంది. వాట్సాప్ ద్వారా సేవింగ్స్ ఎకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంది (Savings account balance) ? చివరి మూడు లావాదేవీలు ఏంటి (Last three transactions), క్రెడిట్ కార్డు లిమిట్ ( credit card limit), ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్స్ వివరాలు, క్రెడిట్ కార్డు (credit card), డెబిట్ కార్డు (debit card)ను బ్లాక్ చేయడం లేదా అన్‌బ్లాక్ చేయడం లాంటి సేవలు అందించనున్నట్టు ఐసిఐసిఐ వెల్లడించింది. అంతేకాకుండా సమీపంలోని మూడు ఏటీఎం కేంద్రాలు, మూడు బ్రాంచీలను కూడా తెలుసుకునేందుకు అవకాశం కల్పించినట్టు ఐసిఐసిఐ బ్యాంక్ పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియా (Social media) ప్రాధాన్యం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో వినియోగదారులు అందిరకీ చేరువ అయ్యేందుకు తాము అనునిత్యం పరితపిస్తూనే ఉంటామని.. అందులో భాగంగానే ఇటీవలే ఐసిఐసిఐస్టాక్ (ICICIStack) తీసుకొచ్చామని.. తాజాగా ఇలా వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు లాంచ్ చేశామని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనూప్ బగ్చీ తెలిపారు. 


వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందడం ఎలా ?
ఐసిఐసిఐ బ్యాంక్‌కి చెందిన వాట్సాప్ నెంబర్ 9324953001 ను మీ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోండి.
ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాతో ముడిపడి ఉన్న మీ వాట్సాప్ ఫోన్ నెంబర్ నుండి Hi అని ఓ సందేశం పంపించండి.
బ్యాంకు నుండి వివిధ రకాల సేవల జాబితాతో కూడిన ఓ సందేశం వస్తుంది.
అందులోంచి మీకు అవసరమైన సేవలను ఎంచుకుని ఇదిగో ఉదాహరణకు ఇలా <Balance> లేదా <Block> <home loan> లేదా <personal loan> లేదా <instant loans> అని టైప్ చేస్తే చాలు మీకు తిరిగి బ్యాంక్ నుండి మీకు కావాల్సిన సమాచారంతో సందేశం వస్తుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..