)
IMD Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి బలపడుతోంది. ఇది కాస్తా అల్పపీడనంగా మారవచ్చు. వాతావరణంలోని ఈ పరిస్థితుల కారణంగా మందగించిన నైరుతి రుతు పవనాలు తిరిగి పుంజుకుంటున్నాయి. రానున్న ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
ఓ వైపు ఉపరితల ఆవర్తనం, మరోవైపు చురుగ్గా కొనసాగుతున్న నైరుతి రుతు పవనాల కారణంగా ఏపీలో 2-3 రోజులు, తెలంగాణలో 5 రోజులు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనుండగా మరి కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. అందుకే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఆరుబయట, పొలాలు, చెట్లు, టవర్ల కింద తిరగవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ప్రకాశం, నంద్యాల, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అదే విధంగా కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో మాత్రం తేలికపాటి వర్షసూచన ఉంది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.
ఇక తెలంగాణలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చు. ఈ నెల 19 వరకు హైదరాబాద్‌లో వర్షాలు పడనున్నాయి. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాభాద్, అదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook