
Cyclone Alert: బంగాళాఖాతంలో మరో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఇది రానున్న రోజుల్లో తుపానుగా మారనుందని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది
క్రమంగా తుపానుగా పరివర్తనం చెందనుంది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. సముద్రం తీరంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై శక్తి తుపాను తీవ్ర ప్రభావం చూపించనుంది.
అటు తెలంగాణలో కూడా భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూలు, ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. ఈ వాయుగుండం మరింతగా బలపడి తమిళనాడు తీరం మీదుగా ఉత్తర దిశగా కదలనుంది. ఫలితంగా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడవచ్చు. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చు. పిడుగులు కూడా పడే ప్రమాదం ఉన్నందున వర్షాలు పడేటప్పుడు చెట్లు, టవర్లు, విద్యుత్ స్తంభాల క్రింద, పొలాల్లో ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook