)
AP Summer Effect: ఈ ఏడాది వేసవి భయపెడుతోంది. మార్చ్ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఎండలు భగభగమండనున్నాయి.
ఈ ఏడాది వేసవి చాలా తీవ్రంగా ఉండబోతోంది. వాస్తవానికి ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. మార్చ్ నెలలో సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదు కానుందని ఐఎండీ వెల్లడించింది. దీనికితోడు మార్చ్ 10వ తేదీ తరువాత ఏపీలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. ఉదయం 9 గంటలకే సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉంటోంది. మద్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ నెల నుంచి వడగాల్పులు వీస్తాయనే హెచ్చరికల నేపధ్యంలో వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇక ఏప్రిల్, మే నెలల్లో అయితే ఎండల తీవ్రత మరింత పెరగనుంది. కోస్తాంద్రలోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈసారి భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. ఓ వైపు ఎండల తీవ్రత, మరోవైపు ఉక్కపోత కారణంగా విపరీతమైన డీ హైడ్రేషన్ సమస్య ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సాధ్యమైనంతగా ఎక్కువ నీళ్లు తాగడం, ఎండలో వెళ్లకపోవడం అలవాటు చేసుకోవాలంటున్నారు.
డీ హైడ్రేషన్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు. లేదా ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరికాయ నీళ్లు అధికంగా సేవించాలి. మార్చ్ 10వ తేదీ తరువాత రాష్ట్రంలో వడగాల్పుల ప్రభావం ఉంటుంది. మే నెలలో ఇది తీవ్రంగా ఉంటుంది. మే నెలలో అయితే ఉష్ణోగ్రత 45-47 డిగ్రీలు దాటిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి