Heavy Rains: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్రమంగా ఇది తుపానుగా మారనుంది. అటు బంగాళాఖాతంలో సైతం ఈ నెల 27వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి.
ఈ ఏడాది సాధారణం కంటే భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి రుతు పవనాలు గతం కంటే ముందస్తుగా రావడమే కాకుండా చురుగ్గా ఉండటం ఓ కారణమైతే ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు మరో కారణంగా ఉన్నాయి. ఈ అల్పపీడనం కాస్తా క్రమంగా తుపానుగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ ఇవాళ సాయంత్రానికి వాయుగుండంగా బలపడనుంది. ఫలితంగా తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు రాష్ట్రంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు పడనున్నాయి. ఈ మేరకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు తప్పేట్టు లేవు. ఏపీలో కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదముంది. ఏపీలోని తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షం పడనుంది.
Also read: Jio: ఇంత చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లు మీకు మరెక్కడా దొరకవు! జియో కస్టమర్లకు 3 జాక్‌పాట్ ఆఫర్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి