IMD Weather Alert: దేశమంతా వాతావరణం ఒక్కసారిగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా ఓ కారణంగా ఉంది. ఎండల్లో వర్షాలతో వాతావరణం చల్లబడి ప్రజలు రిలాక్స్ అవుతున్నారు. కానీ అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి. ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, హర్యానా, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతుంటే దక్షిణ భారతదేశంలో అందుకు భిన్నంగా ఉంది. తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుంటే ఇంకొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోత ఉంటోంది. వాతావరణంలో తేమ అధికంగా ఉండి ఇబ్బందిగా మారుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న 3 రోజులు అంటే ఏప్రిల్ 19 వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీయనున్నాయి. ఇక తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ వేగంతో గాలులు వీయనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో అయితే ఈ నెల 22 వరకూ వర్షాలు తప్పవు.
జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఏప్రిల్ 18, 19 తేదీల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. యూపీలోని లక్నో, వారణాసి, జోన్‌పూర్, ప్రయాగ్‌రాజ్, ఘాజీపూర్ చందౌలి, మీర్జాపూర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో మాత్రం వేడి గాలులు అధికంగా ఉంటాయి. ఈ నేల 19 వరకూ వడగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది.
Also read: Summer Holidays: తెలంగాణలో విద్యార్ధులకు పండగే, సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









