IMD Weather Report: దేశంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉత్తరాదిలో ఎండలు భగభగ మండుతుంటే దక్షిణాదిలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంది. దక్షిణాదిలో బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఇవాళ భారీ వర్షం నమోదైంది.
దేశంలో విభిన్న వాతావరణం కన్పిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో వడగండ్లు, ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. రానున్న 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ఏప్రిల్ 6 వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఉరుములు మెరుపులతో వర్షాలు పడనున్నాయి. దక్షిణ కర్ణాటక, కేరళ, మాహేలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు పడవచ్చు.
అదే సమయంలో మధ్యప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర, మారఠ్వాడ ప్రాంతాల్లో కూడా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు, వడగండ్లతో వర్షాలు పడనున్నాయి. ఒడిశా, కొంకణ్, గోవా, కోస్తా కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఉత్తరాదిలో మాత్రం క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్ సహా ఇతర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. రానున్న 5 రోజుల్లో పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీల వరకూ ఉండవచ్చని అంచనా. వాయువ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత 3-5 డిగ్రీలు పెరగవచ్చు. మధ్య భారతదేశం, మహారాష్ట్రలో గరిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీల వరకూ పెరగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 7వ తేదీ వరకు రాజస్థాన్ ప్రాంతంలో వడగాలులతో వాతావరణం పూర్ది వేడిగా ఉండనుంది.
Also read: IPL 2025 KKR vs SRH: ఐపీఎల్ 2025 కేకేఆర్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ డూ ఆర్ డై మ్యాచ్‌లో ప్లేయింగ్ 11 ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









