Rules Change: మార్చి 1వ తేదీ నుంచి కొత్త రూల్స్‌.. ముందుగానే తెలుసుకోండి..

Rules Change From March 1st: మార్చి 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. నేడు ఫిబ్రవరి చివరి రోజు.  ఆర్థికపరంగా  రేపటి నుంచి కొత్త మార్పులు ఏం రానున్నాయో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Written by - Renuka Godugu | Last Updated : Feb 28, 2025, 04:28 PM IST
Rules Change: మార్చి 1వ తేదీ నుంచి కొత్త రూల్స్‌.. ముందుగానే తెలుసుకోండి..

Rules Change From March 1st: రేపు మార్చి 1వ తేదీ మన దేశంలో కొన్ని ఆర్థిక పరంగా మార్పులు చేశారు. ముఖ్యంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తారు. ఇది కాకుండా కొన్ని ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్ విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఆయిల్‌ గ్యాస్‌ కంపెనీలు కూడా ధరల్లో భారీ మార్పులు చేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల సమయంలో ఆయిల్‌ గ్యాస్‌ కంపెనీలు ఇంధన ధరలు సవరణ చేస్తాయి. అయితే, ఈసారి డొమెస్టిక్‌ లేదా కమర్షియల్‌ గ్యాస్‌ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనేది రేపు తెలుస్తుంది. అయితే, మార్చి 1 నుంచి ఏ మార్పులు వస్తాయి తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

జెట్ ఇంధన ధరలు…
ఆయిల్ గ్యాస్ ధరలను రేపు సవరణ చేస్తారు. అయితే, ఎయిర్‌ టర్బైన్‌ ఫ్యుయల్‌ (ATF) ధరలు పెరగనున్నాయి. రేపటి నుంచే వీటి ధరలు పెరగనున్నాయి. ఈ మార్పులు కూడా రేపటి నుంచే అందుబాటులోకి వస్తాయి. ఇది విమాన ప్రయాణికులకు భారంగా కానుంది.

యూపీఐ ద్వారా ఇన్సూరెన్స్ ప్రీమియం.
రేపటి నుంచి IRDI ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని యూపీఐ ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుంది. మార్చి ఒకటో తేదీన యూపీఐ పేమెంట్ ద్వారా ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించే అవకాశం లభిస్తుంది. ఇది కొన్ని కోట్ల మందికి భారతీయులకు భారీ ఊరట అందించే విషయం.

UAN డెడ్ లైన్ మార్చి 15..
ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) బ్యాంకుతో లింక్ చేసే సదుపాయం మార్చి 15 తేదీ వరకు చివరి తేదీ. అంతేకాదు ఆధార్‌ కార్డు కూడా ఈపీఎఫ్ఓకు లింక్‌ చేయాల్సి ఉంటుంది. ఇది ELI స్కీమ్   లబ్దిదారులకు తప్పనిసరి.

ఇదీ చదవండి:  ఈ జ్యూస్‌ తాగితే గుండె ఆరోగ్యం.. నిత్య యవ్వనం, మలబద్దకం పరార్..

మ్యూచువల్ ఫండ్స్ 10 నామినీ..
మ్యూచువల్ ఫండ్స్ డిమ్యాట్‌ అకౌంట్స్ లో సెబీ పెద్ద మార్పులు తీసుకువచ్చింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం పెట్టుబడిదారులు 10 మందిని నామినీగా చేర్చుకునే అవకాశం కల్పించింది. డీమ్యాట్‌ ఖాతాదారులు లేదా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులు పదిమంది వరకు నామినీగా చేర్చవచ్చు. ఇది రేపటి నుంచి అందుబాటులోకి రానుంది..

ఇదీ చదవండి: టన్నెల్‌ చివరి వరకు వెళ్లిన ఆర్మీ రెస్క్యూ టీమ్‌.. 'ఆ 8 మంది చనిపోయి ఉంటారు'..

14 రోజులు బ్యాంకులు బంద్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ హాలిడేస్ మార్చికు సంబంధించిన సెలవుల జాబితా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొత్తంగా మార్చి నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల ప్రత్యేక దినాలు, పండుగలు సందర్భంగా ఈ బ్యాంకు హాలిడేస్ వర్తిస్తాయి. బ్యాంకులు ఈ నెలలోనే రెండు రోజులు ఐదు రోజులు పనిదినాలు సందర్భంగా స్ట్రైక్‌ చేయనున్నాయి. ప్రతి ఆదివారం, రెండో, నాలుగో శనివారం కాకుండా ఐదు రోజులు పనిదినాల కోసం బ్యాంక్‌ యూనియన్‌ అసోసియేషన్‌ స్ట్రైక్‌ 24, 25వ తేదీ నిర్వహించనున్నారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News