Income Tax 8 New Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఇన్‌కంటాక్స్ రూల్స్ ఇవే

Income Tax 8 New Rules: ఏప్రిల్ నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది. వేతన జీవులకు అతి పెద్ద ప్రయోజనం కలగనుంది. కొత్త ట్యాక్స్ విధానం అమల్లోకి రానుండటంతో ట్యాక్స్ రూపంలో భారీగా లబ్ది పొందనున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ నుంచి ఇన్‌కంటాక్స్ విషయంలో రానున్న 8 కీలకమైన నిబంధనలు ఏవో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 27, 2025, 10:43 PM IST
Income Tax 8 New Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఇన్‌కంటాక్స్ రూల్స్ ఇవే

Income Tax 8 New Rules: ఫిబ్రవరి కేంద్ర బడ్జెట్‌లో ట్యాక్స్ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వేతన జీవులకు భారీగా ట్యాక్స్ మినహాయింపులు కలిగాయి. 12 లక్షల వరకూ ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ లేకపోవడం కచ్చితంగా ప్రతి ఒక్కరికీ లాభించే అంశం. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న ఆర్ధిక సంవత్సరం 2025-26లో వేతన జీవులు ప్రధానంగా ఎదురు చూస్తున్నది ట్యాక్స్ మినహాయింపు గురించి. 12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ లేదని బడ్జెట్‌లో ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ 75 వేలు కలుపుకుంటే ఏడాదికి 12.75 లక్షల వరకూ ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. కొన్న పన్ను విధానంలో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. 

ఈక్విటీ షేర్లు, మ్యూచ్యువల్ ఫండ్స్ యాక్సెస్ చేసేందుకు అథారిటీని మీ నామినీకు కూడా ఇవ్వవచ్చు. వేతన జీవులు ఏప్రిల్ 1 నుంచి గరిష్టంగా రెండు ఆస్ధులపై నిల్ వ్యాల్యూ క్లెయిమ్ చేయవచ్చు. సెల్ఫ్ ఆక్యుపైడ్ కాకపోయినా వర్తిస్తుంది. ఇక మరో మార్పు యూఎల్ఐపీ పన్ను విధానం గురించి. 2.5 లక్షలు దాటి ప్రీమియం ఉంటే వచ్చిన ఆదాయంపై ట్యాక్స్ చెల్లించాలి. ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 112 ఎ ప్రకారం ట్యాక్స్ ఉంటుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్. పిల్లల ఎన్‌పీఎస్ ఖాతాకు విరాళం ఇచ్చి ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్‌లో 50 వేల రూపాయలు అదనపు మినహాయింపు లభిస్తుంది.

బ్యాంక్ డిపాజిట్లపై టీడీఎస్ పరిమితిని 40 వేల నుంచి 50 వేలకు పెంచారు. టీడీఎస్ కనీస మొత్తం పెరుగుతుంది. కొత్త ట్యాక్స్ రెజీమ్‌లో స్లాబ్ రేట్లు మారుతున్నాయి. కనీస మినహాయింపు పరిమితి 3 లక్షల నుంచి 4 లక్షలకు పెరుగుతుది. 24 లక్షల దాటి ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ రిబేట్ ఉంటుంది.

Also read: DA Hike Announcement: ఉద్యోగులకు బిగ్ జాక్‌పాట్, డీఏ పెంపు 2 శాతం కాదు 3 శాతం ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News