)
Independence Day 2025 PM Narendra Modi Speech: దేశ స్వాతంత్య్రం 78 వసంతాలు పూర్తై 79వ యేట అడుగుపెట్టిన సందర్భంగా దేశ వ్యాప్తంగా జాతి, మత కుల భేదాలను పక్కన పెట్టి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక 2014లో భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా 12వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన రెండో ప్రధాన మంత్రిగా రికార్డు క్రియేట్ చేశారు నరేంద్ర మోడీ. అంతేకాదు స్వాతంత్య్రం అనంతరం జన్మించిన వ్యక్తిగా ప్రధానిగా ఇన్ని సార్లు జాతీయ జెండా ను ఆవిష్కరించిన వ్యక్తిగా మోడీ రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాదు ప్రజల చేత మూడు సార్లు ఎన్నికైన ప్రధాని మంత్రిగా రికార్డు క్రియేట్ చేశారు.
ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోడీ తొలిసారి కాషాయ తలపాగాతో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా ఈ యేడాది ఏప్రిల్ 22న పాకిస్థాన్ మన దేశంపై జరిపిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ఖండించారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు .. విహార యాత్రకు వచ్చిన మన వాళ్లను మతం అడిగిమరి చంపడం దారుణమన్నారు. భార్యా, పిల్లల ముందే భర్తలను, తండ్రులను చంపి పెద్ద తప్పు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి .. పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నక్కిన ఉగ్రవాదులను మన దేశ జవానులు తుద ముట్టించారు. ఇకపై పాకిస్థాన్ సహా ఇతర ఉగ్రవాదులు మన దేశంపై కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చామన్నారు. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపినట్టు తెలిపారు.
అంతేకాదు పాకిస్థాన్ చేస్తోన్న అణ్వాయుధాల బెదిరింపులకు భారత్ భయపడేది లేదు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న వీర జవానులకు సెల్యూట్ చేశారు. అంతకాదు దేశ ప్రజలు వీర సైనికులకు సలామ్ చేయాల్సిన సమయం ఇది. మొత్తంగా పాకిస్థాన్ ను మట్టిలో కలిపిసే సమయమిదే అని ఇండైరెక్ట్ గా పాక్ ఫీల్డ్ మార్షల్ ఆషీఫ్ మునీర్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఎర్ర కోట వేదికగా మేము ఆపరేషన్ సింధూర్ ను ఏ దేశమూ చెప్పందని ఆపలేదని అమెరికాకు ఇండైరెక్ట్ గా చురకలు అంటించారు. ఎవడి గన్నాయిగాడు చెబితే మేము ఆపరేషన్ సింధూర్ ను ఆపలేదు.ఆపరేషన్ సిందూర్ ఆగలేదు. తాత్కాలిక విరామమే ఇచ్చామని ఉద్ఘాటించారు. ఇక పంద్రాగాష్టు వేడుకల దృష్ట్యా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.