)
India big shock to Pakistan country: పహల్గం ఉగ్రదాడి ఘటన దేశంలో సంచలనంగా మారింది. దీనిపై భారత్ సీరియస్ అయ్యింది. ఇప్పటికే మోదీఆధ్వర్యంలో హైపవర్ సమావేశం కూడా జరిగింది. అయితే.. ప్రస్తుతం భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది.
పాక్ తో అన్నిరకాల దౌత్య సంబంధాలు తెగదింపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అదే విధంగా అటారీ చెక్ పొస్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సింధూజలాల ఒప్పందం కూడారద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. వీసాలను రద్దు చేసింది. పాక్ పౌరులను ఎట్టిపరిస్థితుల్లో భారత్ లోకి అనుమతించేదిలేదని భారత్ తెల్చిచెప్పింది. పాక్.. రాయబార కార్యలయ సిబ్బందిని.. 50 నుంచి 30 కి తగ్గించారు. భారత్ లో ఉన్న పాక్ వారు.. 48 గంటల్లో వెళ్లిపొవాలని భారత్ హుకుం జారీ చేసింది.
భారత్ పహల్ గామ్ ఘటనపై చాలా సీరియస్ గా ఉంది. అయితే.. గతంలో.. ఉరి, పుల్వామా తర్వాత కూడా సింధు జల ఒప్పందం నిలిపివేయబడలేదు. కానీ .. అమాయక పర్యాటకులపై పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనను మాత్రం భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది.
ఈ క్రమంలో మోదీ నివసంలో.. కేంద్ర మంత్రులు, ముఖ్య అధికారుల ఆధ్వర్యంలో హైపవర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోబాల్ తదితరుల ఆధ్వర్యంలో హైపర్ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు పాక్ సీఎం ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశంకు రావాలని ఇప్పటికే సీఎం... అన్నిపార్టీల నేతలకు లేఖలను రాశారు.
ఈ క్రమంలో భారత్ తీసుకున్న ప్రస్తుతం నిర్ణయం మాత్రం పాక్ కు గట్టి హెచ్చరికగా చెప్పుకొవచ్చు. మొత్తంగా పాక్ ను భారత్ గట్టిగా జవాబు చెప్పాలని యావత్ భారతావని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. సీమాంతర ఉగ్రవాదంను కూకటి వెళ్లతో అణచివేసే దిశగా భారత్ చర్యలు తీసుకుందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి