India - Pak War: పాక్ కు ధీటుగా భారత్ మిస్సైల్ టెస్టులు.. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు..

India - Pak War: పహల్గామ్ లో సామాన్య జనాల పై  ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్.. పాకిస్థాన్ పై కన్నెర్ర జేసింది. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధ ట్యాంకులతో పాటు మిస్సైల్స్ టెస్ట్ చేయడంతో  సైన్యాన్ని మోహరించింది. మరోవైపు నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కూడా సైన్యానికి సెలవులు రద్దు చేసింది. పాకిస్థాన్ కు ధీటుగా సింధు సాగరం (అరేబియా సముద్రం)లో మిస్సైల్ టెస్టులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 25, 2025, 07:37 AM IST
India - Pak War: పాక్ కు ధీటుగా భారత్ మిస్సైల్ టెస్టులు.. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు..

India - Pak War:  పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. భారత్ వైపు చూడాలంటేనే భయపడేలా ఇకపై యాక్షన్ ఉండబోతుందన్నారు. పహల్గాంలో జరిగిన దాడి అత్యంత పాశవికమైందని మోడీ అన్నారు. ఇది పర్యాటకులపై దాడి కాదు.. దేశంపై జరిగిన దాడి అని చెప్పారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకుని.. ప్రపంచమే నివ్వెరపోయేలా శిక్షిస్తామని ప్రధాని మోడీ చెప్పారు. మరోవైపు పాకిస్థాన్ కవ్వింపు చర్యల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. మధ్యంతర క్షిపణులను పరీక్షించింది.  అరేబియా సముద్రం పై ఐఎన్‌ఎస్ సూరత్ నుంచి ఈ క్షిపణి పరీక్ష జరిగింది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఈ మిస్సైల్ చేధించగలదు. ఇందుకు సంబంధించి దృశ్యాలను భారత నావికాదళం విడుదల చేసింది.

Add Zee News as a Preferred Source

పాకిస్థాన్‌  మిస్సైల్ పరీక్షలకు కౌంటర్‌గా భారత నౌకా దళం ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. పాకిస్తాన్ మిస్సైల్ టెస్ట్ కవ్వింపు చర్యల్లో భాగంగానే చేస్తోందని భారత్‌ భావిస్తోంది. పాక్ నుంచి వచ్చే ఎలాంటి దాడినైనా.. ఎలాంటి చర్యలను అయినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ చెబుతోంది.

కరాచీ తీరంలో పాకిస్తాన్ మిస్సైల్ టెస్టులను భారత ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. శాటిలైట్ ఆధారంగా డేటాను సేకరిస్తోంది. భారత్ ఆర్మీ సైతం.. పాక్ సరిహద్దుల్లోని ఆర్మీ క్యాంప్ లకు అదనపు బలగాలను తరలిస్తోంది. అటు పాకిస్థాన్ తమ దేశ సైనికులకు సెలవులు రద్దు చేసింది. భారత విమానాలకు తమ గగనతలాన్ని పాకిస్థాన్ మూసేసింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే యుద్ధం ప్రకటించడమేనని పాక్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు భారత్ కూడా మన దేశ సైనికులకు సంబంధించిన అన్ని సెలవును రద్దు చేస్తూ తక్షణమే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News