India Covid Deaths: దేశంలో మరోసారి 4 వేల కరోనా మరణాలు నమోదు, 2 కోట్ల మంది కరోనాను జయించారు

India Covid-19 Deaths: కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గినా,  వరుసగా మూడోరోజు కోవిడ్19 మరణాలు 4 వేలు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది.

Written by - Shankar Dukanam | Last Updated : May 14, 2021, 11:43 AM IST
India Covid Deaths: దేశంలో మరోసారి 4 వేల కరోనా మరణాలు నమోదు, 2 కోట్ల మంది కరోనాను జయించారు

భారత్‌లో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూ అమలుచేస్తున్నారు. దాని ప్రభావంతో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గినా,  వరుసగా మూడోరోజు కోవిడ్19 మరణాలు 4 వేలు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది.

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,43,144 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,40,46,809 (2 కోట్ల 40 లక్షల 46 వేల 8 వందల 9)కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 4,000 మంది కరోనాతో పోరాడుతూ మరణించారు.  భారత్‌లో మరోసారి 4 వేలకు పైగా మరణాలు సంభవించడం ప్రస్తుత పరిస్థితిని సూచిస్తుంది. దేశంలో కరోనా బారిన పడి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,62,317కి చేరింది. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,44,776 మంది కరోనా మహమ్మారిని జయించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది.

Also Read: Dead Bodies In Ganga: నదిలో COVID-19 మృతదేహాలు, వైరస్ వ్యాప్తిపై నిపుణులు ఏమన్నారంటే

 

భారత్ కరోనాను జయించిన వారి సంఖ్య 2 కోట్లకు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,00,79,599 (2 కోట్ల 79 వేల 5 వందల 99)కి చేరింది. దేశంలో ప్రస్తుతం 37 లక్షల 4 వేల 893 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా పాజిటివ్ కేసుల కన్నా డిశ్ఛార్జ్ కేసులే అధికం. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం యువత ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. దేశంలో ఇప్పటివరకూ 17 కోట్ల 92 లక్షల 98 వేల 5 వందల 84 మందికి కోవిడ్19 టీకాలు తీసుకున్నారు.  

Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం CoWin యాప్‌లో ఇలా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

More Stories

Trending News