India - Pakistan: దీంతో ఆ దేశ సైనిక, పౌర రవాణా విమానాలు వినియోగించే జీపీఎస్, గ్లోనాస్ ,బైడూస్ నేవిగేషన్ వ్యవస్థలను సమర్థంగా అడ్డుకొంటుంది. దీంతో పాక్ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ భారత్‌లో లక్ష్యాలను గుర్తించడంలో తీవ్ర గందరగోళానికి గురవుతాయి. ఫలితంగా యుద్ధ రంగంలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేని స్థితికి పాక్ సైన్యం వెళుతుంది. 2024 సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ ఫేర్ స్టడీస్ లెక్కల ప్రకారం భారత్ వద్ద ఇలాంటి వ్యవస్థలు దాదాపు 50 వరకు ఉన్నాయి. ఇక వాయుసేన రఫేల్ యుద్ధ విమానాల్లోని స్పెక్ట్రా సూట్స్, నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నేవిగేషన్ సిగ్నల్స్‌ను జామ్ చేయగలవు.
ఇక పాకిస్థాన్ లో సొంతంగా తయారుచేసుకొన్న ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వ్యవస్థలు లేవు. కానీ, చైనా నుంచి దిగుమతి చేసుకొన్న డీడబ్ల్యూఎల్-002, జర్బా కోస్టల్ ఈడబ్ల్యూ సిస్టమ్ వంటివి ఉన్నాయి. వీటితోపాటు కమర్షియల్ జామర్లను పాక్ వాడుతోంది. భారత్ చర్యలతో ఈ ప్రాంతంలో నేవిగేషన్‌తో రోజువారీ చేసే పనుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది.
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. మరోవైపు న్యూ ఢిల్లీ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అంచనా వేయలేని పాక్.. తన విమానాలు భారత్‌పై నుంచి కాకుండా వేరే మార్గాలకు మళ్లించింది. ఈనేపథ్యంలో భారత్ ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు పాక్ రవాణా, సైనిక, పౌర విమానాలకు నోటీస్ జారీ చేసింది. దీంతో పాక్ విమానాలు చైనా, శ్రీలంక గగనతలాల మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









