Indian Army Recruitment 2025: ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2025నోటిఫికేషన్ వెలువడింది. ఆర్మీలో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఆర్మీలో ఆఫీసర్ కావాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఎన్‌సిసి స్పెషల్ స్కీమ్‌లో భాగంగా ఈ నియామకాలు చేపడుతోంది ఇండియన్ ఆర్మీ. ఈ ఉద్యోగాలకు అర్హత ఏంటి, ఎలా ఎంపిక చేస్తారు, ఎలా అప్లై చేయాలి, జీతం ఎంత ఉంటుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ ఆర్మీ NCC Special Scheme భాగంగా ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరు కూడా ఆర్మీలో ఆఫీసర్ కావాలనుకుంటే మార్చ్ 15 లోగా ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in. ద్వారా అప్లై చేయవచ్చు. ప్రస్తుతం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత, జీతం, ఎంపిక వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం పోస్టులు ఎన్‌సిసి పురుషులు 70, ఎన్‌సిసి మహిళలు 6. ఈ ఉద్యోగాలకు కావల్సిన వయస్సు 19 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా కళాశాల నుంచి 50 శాతం కనీస మార్కులతో డిగ్రీ పొంది ఉండాలి. ఇక జీతం అనేది కేటగిరీని బట్టి ఉంటుంది. లెవెల్ 10 నుంచి లెవెల్ 18 వరకూ వేర్వేలు పే స్కేల్స్ ఉన్నాయి. కనీస వేతనం 56,100 రూపాయల నుంచి గరిష్టంగా 2.50 లక్షలు ఉంది. ఇక పోస్టులయితే లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, కమాండర్ హోదాలు ఉన్నాయి.
ఎంపిక విధానం ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూ తరువాత మెడికల్ టెస్ట్ ఉంటుంది.
Also read: ICAI CA Results 2025: సీఏ ఇంటర్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









