Top 100 List: అత్యంత శక్తివంతమైన టాప్ 100 జాబితా ఇదే, తెలుగు నుంచి ఆ ఒక్కడే

Top 100 List: ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితా విడుదలైంది. టాప్ 100 జాబితాలో ఒకే ఒక్క తెలుగు హీరో ఉండటం విశేషం. దేశంలోని వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 29, 2025, 10:38 PM IST
Top 100 List: అత్యంత శక్తివంతమైన టాప్ 100 జాబితా ఇదే, తెలుగు నుంచి ఆ ఒక్కడే

Top 100 List: ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఏటా మోస్ట్ పవర్‌ఫుల్ వ్యక్తుల జాబితా జారీ చేస్తుంటుంది. అదే విధంగా 2025 సంవత్సరానికి సంబంధించిన టాప్ 100 జాబితా విడుదల చేయగా ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలవగా ఐకాన్ స్టార్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్ ఆ జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక తెలుగు హీరోగా నిలిచాడు. 

Add Zee News as a Preferred Source

దేశంలోని వివిధ రంగాల్లో రాజకీయం, క్రీడలు, సినిమా, మతం, పారిశ్రామిక రంగాల్లో లబ్ద ప్రతిష్ఠులై శక్తివంతమైన వ్యక్తులుగా కొనసాగుతున్నవారిలో టాప్ 100 ఎంపిక చేస్తుంటుంది ఇండియన్ ఎక్స్‌ప్రెస్. ఈ ఏడాది 2025 మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. దేశానికి మూడు సార్లు ప్రధానిగా చేయడంతో ప్రజాదరణ నిలుపుకున్నారు. ఇక రెండవ స్థానంలో హోంమంత్రి అమిత్ షా ఉంటే మూడో స్థానంలో విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఉన్నారు. ఇక ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 9వ స్థానంలో నిలిచారు. పారిశ్రామిక రంగం నుంచి ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీలు కూడా టాప్ 100 జాబితాలో ఉన్నారు. 

క్రీడరంగానికి సంబంధించి క్రికెట్ నుంచి పరిశీలిస్తే రోహిత్ శర్మ 48వ స్థానంలో, విరాట్ కోహ్లి 72, బూమ్రా 83వ స్థానంలో ఉన్నారు. బాలీవుడ్ నుంచి అలియా భట్ 100 స్థానంలో ఆఖరిలో ఉండటం గమనార్హం. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ జాబితాలో ఒకే ఒక వ్యక్తి చోటు సంపాదించుకున్నాడు. అతనే పుష్పతో దేశవ్యాప్తంగా మేనియా సృష్టించిన బన్నీ అలియాస్ అల్లు అర్జున్ 92వ స్థానంలో ఉన్నాడు. 

ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని రాజకీయ రంగానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 14వ స్థానంలో నిలవగా, రేవంత్ రెడ్డి 28వ స్థానంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ 73వ స్థానంలో ఉన్నారు. 

Also read: JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తుల ప్రక్రియ షురూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News