New Passport Rules: ఇండియన్ పాస్‌పోర్ట్ నిబంధనలు మారాయి. కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. విదేశాలకు వెళ్లేవారు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయమిది. పాస్‌పోర్ట్ చేయించుకోవాలనుకుంటే ఇకపై ఆ సర్టిఫికేట్ తప్పనిసరిగా మారింది. ఆ వివరాలు మీ కోసం
పాస్‌పోర్ట్ అనేది ఓ వ్యక్తి జాతీయత, గుర్తింపును నిర్ధారిస్తుంది. విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కావల్సిన డాక్యుమెంట్. పాస్‌పోర్ట్ సహాయంతో విదేశాలు తిరిగేందుకు, చదువుకునేందుకు లేదా వ్యాపార నిమిత్తం వెళ్లవచ్చు. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం పాస్ పోర్ట్ నిబంధనలు మార్చింది. కొత్త నిబంధనల ప్రకారం పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు అక్టోబర్ 1, 2023 లేదా ఆ తరువాత పుట్టి ఉంటే తప్పనిసరిగా సంబంధిత శాఖ జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. 1980 పాస్‌పోర్ట్ రూల్స్‌లో ఈ మేరకు సవరణలు జరిగాయి. అధికారికంగా గెజిట్‌లో పబ్లిష్ అయిన తరువాత ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. బర్త్ సర్టిఫికేట్ అనేది సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీలోని రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ జారీ చేయాల్సి ఉంటుంది. అదే పుట్టిన తేదీ ప్రూఫ్ అవుతుంది. 2023 అక్టోబర్ 1న లేదా ఆ తరువాత పుట్టినవారికి ఇది వర్తిస్తుంది. ఆ తరువాత పుట్టినవారికి డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ సర్టిఫికేట్ వంటివి సమర్పించవచ్చు.
భారత ప్రభుత్వం జారీ చేసే అతి ముఖ్యమైన డాక్యుమెంట్ అయినందున వెరిఫికేషన్ ప్రక్రియ చాలా కీలకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లేవారికి పౌరసత్వం గురించి నిర్ధారించే డాక్యుమెంట్ ఇదే. ఇందులో మూడు రకాలు ఉంటాయి. రెగ్యులర్, అఫీషియల్, డిప్లొమేటిక్. సాధారణ ప్రజలకు రెగ్యులర్ పాస్‌పోర్ట్ జారీ అవుతుంది. ఇక డిప్లొమేటిక్ అయితే వీవీఐపీలకు ఉంటుది. ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, దౌత్యవేత్తలకు ఇచ్చేది అఫీషియల్ పాస్‌పోర్ట్.
Also read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇండియాదేనా, ఇదే రీజన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









