5 Facilities To Senior Citizens: భారతీయ రైల్వే సీనియర్ సిటిజెన్ల కోసం కొన్ని ప్రత్యేక సేవలను అందుబాటులో తీసుకువచ్చింది. ప్రధానంగా లోయర్ బెర్త్, వీల్ చైర్,, బ్యాటరీ కారు, కొన్ని ప్రత్యేక కౌంటర్లు సీనియర్ సిటిజన్లో కోసం అందుబాటులో ఉంచింది. భారతీయ రైల్వే వృద్ధులను గౌరవిస్తూ వారి సౌకర్యవంతమైన ప్రయాణం కోసం వారి భద్రతకు ఈ సౌకర్యాలు అందిస్తుంది. పురుష వృద్ధులకు 60 ఏళ్ళు పైబడిన వారు. మహిళలు అయితే 58 ఏళ్లు పైబడిన వారికి ఐదు ప్రత్యేక సేవలను అందిస్తోంది.
లోయర్ బెర్త్ ఫెసిలిటీ ..
భారతీయ రైల్వే 60 ఏళ్లు పైబడ్డ పురుషులు, 58 ఏళ్లు పైబడిన మహిళల కోసం ప్రత్యేకంగా లోయర్ బెర్త్ సౌకర్యం కల్పిస్తోంది. వాళ్ళకి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రత్యేక సౌకర్యం కల్పిస్తుంది. ఇది స్లీపర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్ కోచ్‌లకు కూడా వర్తిస్తుంది. సాధారణంగా లోయర్ బెర్త్‌లు ఖాళీగా ఉన్నప్పుడు కూడా సీనియర్ సిటిజెన్లకు మాత్రమే కేటాయిస్తుంది.
వీల్ చైర్..
సీనియర్ సిటిజెన్ల కోసం భారతీయ రైల్వే వీల్ చైర్ ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకువచ్చింది. కొంతమంది వృద్ధులు కాస్త నడవడంలో ఇబ్బందులు పడే వారికి ఈ వీల్ చైర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి సంబంధించిన పోర్టర్లు కూడా అందుబాటులో ఉంటారు వారు సహాయం చేస్తారు.
స్పెషల్ టికెట్ కౌంటర్..
భారతీయ రైల్వే వృద్ధుల కోసం ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లను కూడా అందుబాటులో ఉంచింది. ఇది ప్రధానంగా దివ్యంగులకు కూడా వర్తిస్తుంది. వాళ్ళు ఎక్కువ సమయం పాటు క్యూ లైన్ లో వేచి ఉండలేరు. కాబట్టి సులభంగా టికెట్లను పొందవచ్చు .
బ్యాటరీ వెహికల్స్..
బ్యాటరీ వెహికల్స్ కూడా ఉచితంగా రైల్వే అందిస్తుంది. ఇది పెద్ద రైల్వే స్టేషన్ లో అందుబాటులో ఉంది. అది ప్లాట్ ఫారం వరకు తీసుకువెళ్లే సౌకర్యం కల్పిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా కొన్ని లోకల్ ట్రైన్లలో కూడా సీనియర్ సిటిజెన్ల కోసం ప్రత్యేక సీట్లను రిజర్వ్ చేశారు.
రాయితీ..
అయితే కరోనాకు ముందు వరకు ఈ సీనియర్ సిటిజెన్లకు ప్రత్యేకంగా 50% వరకు డిస్కౌంట్ కూడా అందించేది. ఆ తర్వాత దీని మల్లి ప్రారంభించలేదు. ఎన్నో సామాజిక సంఘాలు కూడా మళ్లీ డిస్కౌంట్ అందించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇది రైల్వే ఆదాయం ప్రభావం పడుతుందని ఇండియన్ రైల్వే చెబుతోంది.
సమాచారం..
అయితే వృద్ధుల కోసం కొన్ని సమాచార సేవలు కూడా అందుబాటులో ఉంచింది. రైల్వే ట్రోల్ ఫ్రీ నెంబర్లు, హెల్ప్ లైన్ లో వాలంటీర్ సేవలు కూడా అందిస్తున్నారు, త్వరగా ఏదైనా సమాచారం కావాలంటే సూచించిన బోర్డు స్టేషన్లో సమాచార కేంద్రాలు ఉంటాయి. వృద్ధులు నేరుగా వెళ్లి అక్కడ ఎంక్వయిరీ చేయవచ్చు. అంతేకాదు వాళ్లు సొంతంగా ప్రయాణం కూడా చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు.
IRCTC..
రైల్వే ఆధునికంగా IRCTC యాప్, వెబ్‌సైట్ ద్వారా సులభంగా టికెట్ బుక్ చేసుకుని సౌకర్యం కూడా కల్పిస్తుంది. ఇది మాత్రమే కాదు మనం ట్రైన్ స్థితి సమాచారం కూడా పొందవచ్చు. దీనికి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వృద్ధుల ప్రయాణానికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక్కడ బుకింగ్ సమయంలో 'సీనియర్ సిటిజెన్' అని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
Also read: నేటి రాశిఫలాలు.. ఈ రాశికి అన్నింటా విజయమే.. శుభకార్యాల్లో పాల్గొనవచ్చు..
Also read: తిరుమల వెళ్లే భక్తులకు బంపర్ గుడ్‌న్యూస్.. వెంటనే దర్శనం, గదుల టిక్కెట్లు బుక్ చేసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి