ఇకపై రైళ్లలో కోరాస్ కమాండోలు

ఇకపై రైళ్లలో కోరాస్ కమాండోలు

Last Updated : Aug 15, 2019, 12:30 AM IST
ఇకపై రైళ్లలో కోరాస్ కమాండోలు

ప్రయాణికులు, వారి వస్తు సామాగ్రి భద్రత నిమిత్తం నక్సల్ ప్రభావిత ప్రాంతాలతోపాటు ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, ఈశాన్యంలోని త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రయాణించే రైళ్లలో ఇకపై సుశిక్షితులైన కోరాస్(కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ) కమాండోలను మొహరించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. 

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స (ఆర్‌పిఎస్‌ఎఫ్) దళాల నుంచి వచ్చిన కమాండోల కలయికే ఈ కోరాస్ కమాండోలు. రైల్వేల్లో భద్రతా ప్రమాణాల పెంపు కోసమే ప్రత్యేకంగా ఏర్పడిన ఈ కమాండోల బృందానికి ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ నేతృత్వం వహిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో శత్రువులను ఎదుర్కునేందుకు వీలుగా ఈ కోరాస్ కమాండోలకు బులెట్ ప్రూఫ్ జాకెట్స్, హెల్మెట్స్‌తో పాటు అధునాతన ఆయుధాలు అందిస్తున్నట్టు ఆర్పీఎఫ్ డీజి తెలిపారు.

Trending News