
Railway New System: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులకు రైల్వే శాఖ శుభవార్త అందిస్తోంది. రైలు టికెట్ కన్ఫర్మేషన్ కోసం చివరి వరకు ఆగాల్సిన పని లేదు. రైలు బయలుదేరడానికి 24 గంటల ముందే సమాచారం తెలిసిపోతుంది. ఈ మేరకు రైల్వే శాఖ కొత్త విధానం ప్రవేశపెట్టింది.
రైల్వే రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు టికెట్ వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీలో ఉంటే కన్ఫర్మేషన్ కోసం రైలు బయలుదేరడానికి 3-4 గంటల ముందు వరకు నిరీక్షించాల్సి వచ్చేది. ఎందుకంటే ఛార్ట్ అప్పుడే సిద్ధమౌతుంది. ఛార్ట్ సిద్ధమయ్యాకే టికెట్ కన్ఫామ్ అయిందో లేదో తెలుస్తుంది. అయితే ఇలా చివరి నిమిషం వరకు వేచి చూసి కన్ఫామ్ కాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కూడా సమయం ఉండదు. అందుకే రైల్వే శాఖ ఇప్పుడు కొత్త విధానం ప్రవేశపెట్టింది. ఇకపై 24 గంటల ముందే చార్ట్ సిద్ధం కానుంది. అంటే వెయిటింగ్ లిస్ట్ టికెట్ స్టేటస్ గురించి 24 గంటల ముందే తెలిసిపోతుంది. దాంతో ఒకవేళ టికెట్ కన్ఫామ్ కాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సమయం ఉంటుంది.
రైల్వే వ్యవస్థను ప్రయాణీకులకు మరింత చేరువ చేసేందుకు, మరింత ఆధునికంగా మార్చేందుకు, సేవలు మెరుగుపర్చేందుకు, చివరి నిమిషంలో రద్దీ, గందరగోళం తగ్గించేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ కొత్త విధానం పరీక్షించేందుకు పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తోంది. 24 గంటల ముందు ఛార్ట్ సిద్ధం చేయడం సాధ్యమా కాదా, ప్రాక్టికల్‌గా ఎదురయ్యే సమస్యలేముంటాయనేది పరిశీలించనున్నారు. ఇది విజయవంతమైతే దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో ఈ విధానం ప్రవేశపెట్టనున్నారు.
ఈ కొత్త విధానం సక్సెస్ అయితే ప్రయాణీకులు తమ టికెట్ కన్ఫర్మేషన్ గురించి ముందుగానే తెలుసుకోగలరు. లాస్ట్ మినిట్ హర్రీని తగ్గిస్తుంది. రైల్వే ప్రయాణీకులకు ఈ కొత్త విధానం మరింత సౌకర్యవంతం కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook