Show Cause Notice To Indigo Airlines: దేశంలో అతిపెద్ద ప్రైవేటు విమానాయన సంస్థ అయిన ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిరోజు వందలాది విమానాలు రద్దు అవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు ప్రయాణించే వారికి తీవ్ర ఇబ్బందు పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర సౌకర్యానికి గురైన ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తమ బాధ వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో డీజీసీఏ ఇండిగో సీఈఓకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. కొన్ని రోజులుగా అనేక విమానాలు రద్దు అవుతున్న నేపథ్యంలో డీజీసీఏ 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరింది.
ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు? డీజీసీఏ అధికారికంగా ఇండిగో సీనియర్ అధికారిని కోరింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు విమానాయన సంస్థ ప్రతిస్పందన వచ్చిన తర్వాతనే శిక్షారసమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని డీజీసీఏ పేర్కొంది.
ఒకటి కాదు రెండు రోజు దాదాపు వారం రోజులుగా ఇండిగో విమానాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ నేపథంలో టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. డీజీసీఏ 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర సౌకర్యానికి గురైతున నేపథ్యంలో ఎందుకు మీపై చర్యలు తీసుకోకూడదని కూడా ప్రశ్నించింది. మరోవైపు ప్రభుత్వ పౌర విమాన డైరెక్టర్ జనరల్ ఇండిగో పై చర్యలు తీసుకోవడానికి సన్నహాలు చేస్తున్నారు. ఇక 24 గంటల్లో స్పందించకపోతే ఏకపక్ష నిర్ణయమే ఉంటుందన్నారు.
పౌర విమానాయన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు. సాధారణ స్థితికి ఇండిగో విమానాయన సేవలు పునరుద్ధరించడమే తక్షణ ప్రాధాన్యమని.. టికెట్ డబ్బులు వెంటనే తిరిగి చెల్లించేలా చూడాలని ఆదేశించారు. అయితే ఇప్పటికే డీజీసీఏ నలుగురు సభ్యులతో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా సిబ్బంది కొరత కారణంగా దేశ వ్యాప్తంగా సేవలు నిలిచిపోయాయి. ఇక శనివారం రోజు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇండిగో సీఈఓ పీటర్‌తో సుదీర్ఘ సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై మాట్లాడారు.
ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో విమానాశ్రయంలోనే పెద్ద ఎత్తున ప్రయాణికులంతా ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రిపూట ప్రయాణం చేసేవారు తీవ్ర ఇబ్బందులు కూడా పడ్డారు. కనెక్టింగ్ విమానాలు దొరకపోవడం వల్ల పిల్లలు, వృద్దులు ఇబ్బందులకు లోనయ్యారు. అయితే వారికి హోటల్ వసతి, తక్షణ డబ్బు చెల్లింపులు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. శుక్రవారం ఒకరోజు 1600 కి పైగా విమానాలు, శనివారం 800 విమానాలను ఇండిగో రద్దు చేసింది.
Read more: గోవా నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 23 మంది దుర్మరణం, కారణమేంటంటే..?
Read more: ఎయిర్‌టెల్ యూజర్‌లకు బిగ్ షాక్.. ఆ 2 బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్‌కు బ్రేక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









