Viral Video: గాల్లో ఎగురుతున్న విమానంలో గొడవ..చెంపచెళ్లు మనేలా కొట్టాడు..వైరల్ వీడియో

Indigo Flight Incident: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్‌ చేశాడు. ముంబయి నుంచి కోల్‌కతా వెళ్తున్న ఓ విమానంలోని ఓ ప్రయాణికులు తన పక్కన ఉన్న ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

Written by - Harish Darla | Last Updated : Aug 2, 2025, 12:28 AM IST
Viral Video: గాల్లో ఎగురుతున్న విమానంలో గొడవ..చెంపచెళ్లు మనేలా కొట్టాడు..వైరల్ వీడియో

Indigo Flight Incident: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్‌ చేశాడు. ముంబయి నుంచి కోల్‌కతా వెళ్తున్న ఓ విమానంలోని ఓ ప్రయాణికులు తన పక్కన ఉన్న ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. చెంపపై బలంగా కొట్టడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. దీంతో ఆ విమానంలో సడెన్‌గా గందరగోళం తలెత్తింది. ఇద్దరు విమాన సిబ్బంది దెబ్బతిన్న వ్యక్తిని తీసుకెళ్తున్న క్రమంలో నిందితుడు చెంపదెబ్బ కొట్టాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

Add Zee News as a Preferred Source

దీంతో చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిపై విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులు నిందితుడిపై అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఆ వ్యక్తిని కొట్టావని నిలదీశారు. నిల్చున్న అతడి వల్ల తనకు సమస్య ఎదురైందని.. అందుకే తాను కొట్టానని నిందుతుడు చెప్పుకొచ్చాడు. ఇదంతా వీడియోలో రికార్డు అయ్యింది. చిన్న విషయానికే కొడతారా? అని మరో వ్యక్తి అతడ్ని గట్టిగా నిలదీశాడు. అయితే నిందితుడుపై ముందుగానే కోల్‌కతా విమానశ్రయానికి సమాచారం అందించిన పోలీసులు.. చేయి చేసుకున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 

లాభాలకు గండి..
అహ్మదాబాద్ విమానం ప్రమాదం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విమానాలలోని లోపాలు ఇటీవలే ప్రజలను తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగోకు సంబంధించిన కొన్ని విమానాల్లో క్యాబిన్ క్రూ ప్రవర్తన బాగోలేక.. లేదా విమానంలో సాంకేతిక లోపాల కారణంగా తరచూ ఇండిగో గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఒకవేళ ఆ చర్చ పాజిటివ్‌గా అయ్యి ఉంటే బాగుండేది. నెగెటివ్ టాక్ రావడం వల్ల ఈ సంస్థకు చెందిన లాభాలు బాగా తగ్గాయి.  ప్రస్తుతం జరుగుతున్న జూన్‌ త్రైమాసికంలో ఇండిగో పేరెంటల్ కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లాభం 20% క్షీణించి రూ. 2176.3 కోట్లకు కుప్పకూలిపోయింది. అయితే ప్రయాణికుల సంఖ్య మాత్రం పెరిగి 12 శాతం పెరిగి 3.1 కోట్ల మంది ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించినట్లు తెలుస్తోంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇండిగో కు రూ. 2,728 కోట్లు లాభం గడించింది. 

Also Read: Ind Vs Eng: కింగ్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్..ఒక్క సిరీస్‌లోనే రికార్డులన్నీ ఊదేశాడు!

Also Read: Ind Vs Eng: ఇంగ్లాండ్ టీమ్‌ను ఉతికి ఆరేసిన భారత బౌలర్లు.. సిరాజ్, ప్రసిద్ధ్ కుమ్మేశారు!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News