Indigo: ‘ఇండిగో’ విమానాల రద్దు వెనక అసలు కారణాలు ఇవేనా.. తెర వెనక జరిగింది ఇదే..!

Indigo: వేళకు బస్ లేదని అక్కడక్కడ... ఇబ్బంది పడటం సర్వ సాధారణం... రైలు రావడం ఆలస్యమైనా.. వేళకు రాకపోయినా ఆందోళన... రైలు రద్దైతే ఆ పరిస్థితి ఊహించుకోవడమే కష్టం... అదే విధంగా ఈ మధ్య విమానాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందకుపైగా విమానాలు కదల్లేని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. అది ఇండిగో విమానాల వల్లే జరిగింది. ఇంతకీ ఈ విమానాల రద్దు వెనక అసలు కారణాలు ఏంటని విశ్లేషిస్తే....

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 10, 2025, 03:45 PM IST
Indigo: ‘ఇండిగో’ విమానాల రద్దు వెనక అసలు కారణాలు ఇవేనా.. తెర వెనక జరిగింది ఇదే..!

దూరప్రాంత ప్రయాణానికి సిద్ధమైన ప్రయాణికులు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వేలమంది ఆందోళనకు గురయ్యారు. ఎందుకొచ్చింది ఈ పరిస్థితి? విమానాలకు వచ్చిన సమస్య ఏంటనే విషయాన్ని ఆరా తీస్తే విస్తు పోయే నిజాలు బయట పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దేశీయ సర్వీస్, అంతర్జాతీయ విమానాల ప్రయాణాలు స్తంభించిపోయాయి. అనుకున్న సమయం కంటే గంట, రెండు గంటల ముందే ప్రయాణికులు విమానాశ్రయాలు చేరుకున్నారు. విమానాలు కదిలే పరిస్థితి లేదని తెలుసుకుని  ఖంగుతినడం ప్రయాణికల వంతు అయిందన్నారు.  గమ్యస్థానాలకు చేరుకోవడమెలా? ఎందుకు ఈ పరిస్థితి అని అక్కడికక్కడే విమానాశ్రయ సిబ్బందిని నిలదీశారు. 

Add Zee News as a Preferred Source

దేశవ్యాప్తంగా ఢిల్లీ, కలకత్తా, ముంబై, హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ విమానాశ్రయంలోనే 40 విమాన సర్వీసులను నిలిపివేశారు. విమానాలు కదలే పరిస్థితి లేదని ఆందోళనకు దిగారు. కొన్ని మార్గాల్లో సర్వీస్ రద్దుచేశామని తెలిపారు.  మరికొన్ని విమానాలను రీ షెడ్యూల్ చేశామని విమాన సంస్థ ప్రతినిధులు తెలపడంతో కొందరు ప్రయాణికులు శాంతించారు. రద్దు చేసిన విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు టిక్కెట్టు పైసలను వాపస్ చేశారు.

ఇంతకీ ఇండిగో విమానాలు ఎందుకు ఆగిపోయాయని ఆరా తీస్తే... అనుకూలించని మంచు వాతావరణం, సాంకేతిక సమస్యలు, పైలట్ల విధులకు సంబంధించిన నియంత్రణ విధానాలు, పెరిగిన రద్దీ, సిబ్బంది రోస్టర్‌ నిబంధనల అప్‌గ్రేడ్‌తో తలెత్తిన సమస్యలతో విమాన సర్వీస్ లను నడిపేందుకు అవాంతరాలు చోటుచేసుకున్నాయని అధికారిక సమాచారం.

దేశీయంగా.. అంతర్జాతీయంగా విమానాలు నడిపే అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో.. 100కు పైగా విమానాలను రద్దు చేసింది. మన దేశంలో అతిపెద్ద విమాన వాటాదారు. 65 శాతం వాటా ఉంది.  రాత్రి సమయాల్లో విమానాల ల్యాండిగ్ పట్ల డీజీసీఏ నియంత్రణ నిబంధనలు, వనరుల వినియోగంలో యాజమాన్య ప్రణాళిక లోపంతో ఇండిగో విమాన సర్వీసులు రద్దు అయ్యాయని ఎయిర్‌లైన్స్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. పైలట్ల విధుల నియంత్రణపై ఇటీవల డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) తీసుకొచ్చిన విమాన విధుల సమయ పరిమితి వల్ల పైలట్ల కొరత ఏర్పడుతోందని అభిప్రాయపడింది. 

ముందస్తు సమాచారం లేకుండా కొచ్చిన్‌ విమానాన్ని రద్దు చేశారని.. అయ్యప్ప భక్తులు బుధవారం ఆందోళనకు దిగడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భద్రతాధికారులు జోక్యం చేసుకుని రీషెడ్యూల్‌ చేసిన సర్వీసుల్లో గమ్యస్థానాలకు పంపిస్తామని సముదాయించడంతో ప్రయాణికులు శాంతించారు. రానున్న 48 గంటల్లోనూ పలు విమాన సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిసింది. గత గురువారం కూడా శంషాబాద్‌ నుంచి 36 విమానాలు రద్దు చేసినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. 

దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 200 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 33 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్‌కు రావాల్సిన 27 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. ఢిల్లీ 30, బెంగళూరు ఎయిర్‌పోర్టులో 42 విమానాలు రద్దు అయ్యాయి. చాలా చోట్ల ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. దేశంలో 35 శాతానికి ఇండిగో సర్వీసులు పడిపోయాయి. సిబ్బంది కొరత కారణంగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది.ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున విమాన రద్దయ్యాయి. గురువారం మొత్తం 170కి పైగా ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యే అవకాశం ఉంది. బుధవారం నాలుగు నగరాల్లో కలిపి 200 విమానాలు రద్దయ్యాయి. కార్యకలాపాలు గణనీయంగా దెబ్బతిన్నాయనిఅని ఇండిగో అంగీకరించింది. మొత్తంగా 2 వేలకు పైగా విమాన సర్వీసులు ఇప్పటి వరకు రద్దు అయినట్టు తెలిపింది. అయితే కేంద్ర విమానాయ శాఖ ఇండిగో సర్వీసులపై 5 శాతం కోత విధించి పనిష్ మెంట్ విధించింది. 

Read more:  Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..

Read more:  నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు.. 

శీతాకాల షెడ్యూల్ మార్పులు, వాతావరణం, సాంకేతిక లోపాలు కారణమని ఇండిగో చెబుతోంది. కొత్త ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలతో పైలట్ల కొరత తీవ్రమైంది. షెడ్యూల్ సర్దుబాట్లు చేస్తూ కార్యకలాపాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని.. వచ్చే 48 గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి తెచ్చేందుకు ఇండిగో ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. 

భారీ సంఖ్యలో విమానాల రద్దుకు కారణం ఏంటంటే.. నవంబరులో మొత్తం 1,232 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. 755 ఫ్లైట్లు క్రూ,FDTL కారణంగా రద్దయ్యాయి. 258 విమానాలు ఎయిర్‌స్పేస్ పరిమితుల వల్ల రద్దయ్యాయి. 92 విమానాలు ATC వ్యవస్థ వైఫల్యంతో రద్దయ్యాయి. ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై ఇండిగోను డీజీసీఏ వివరణ కోరింది. ఇండిగో ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. తలెత్తిన సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని.. పరిస్థితులను అధిగమించి విమాన సర్వీసులను యధాతదంగా నడిపేందుకు ఇండిగో చర్యలు చేపట్టింది.అయితే కేంద్ర విమానాయ శాఖ ఇండిగో సర్వీసులపై 5 శాతం కోత విధించి పనిష్ మెంట్ విధించింది.  అంతేకాదు అర్ధాంతరంగా విమాన సర్వీసులు రద్దు చేయడం వల్ల ఎంతో మంది క్షోభ పడ్డారు. కొంత మంది మ్యారేజేస్ మిస్ అయితే.. మరికొందరు ఇంటర్వ్యూలు, కొందరు ఉద్యోగాన్ని... కొందరు తమకు కావాల్సిన వాళ్లను కోల్పోయరని చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇండిగోపై చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు ఇతర విమాన సర్వీసుల వాళ్లు భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని విమాన ప్రయాణికులు చెబుతున్న మాట. 

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News