Karnataka womens Gang raped: దేశంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చాయి. అయినప్పటికి కామాంధులు మాత్రం మారడం లేదు.ఆడది కన్పిస్తే చాలా రెచ్చిపోతున్నారు. మహిళలు, యువతులపై అత్యాచారాలకు పాల్పడుతునే ఉన్నారు. ఈ క్రమంలో ఒక వైపు దేశంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు కర్ణాటకలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇజ్రాయేల్ నుంచి కర్ణాటకకు వచ్చిన టూరిస్ట్ యువతి.. ఒక హోమ్ స్టే ఓనర్ ఇంట్లో దిగింది. వీరంతా గురువారం రాత్రి.. తుంగభద్ర కెనాల్ ను చూసేందుకు వెళ్లారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కాగా.. మరో ముగ్గురు మగవాళ్లు. ఇంతలో కొంత మంది రాత్రి పూట వీళ్ల దగ్గరకు రెండు బైక్ ల మీద వచ్చారు.
పెట్రోల్ కావాలని మొదట వచ్చారు. ఆతర్వాత డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకుండా నిరాకరించడంతో... పురుషుల్ని తుంగభద్రకేనాల్ లో తోసేశారు. యువతులు ఇద్దరి మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. ముగ్గురు యువకుల్లో ఇద్దరి ఆచూకీ లభించింది. మరోక వ్యక్తి జాడ దొరకలేదు. ఈ ఘటన ప్రస్తుతం కన్నడ నాటు దుమారంగా మారింది.
అమెరికాకు చెందిన డేనియల్, మహారాష్ట్ర పర్యాటకుడు పంకజ్‌లు కాలువ నుంచి ప్రాణాలతో బయటకు వచ్చారు. అయితే ఒడిశాకు చెందిన బిబాష్ అనే వ్యక్తి ఆచూకీ లేదు. ఈ మేరకు బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డాగ్ స్వ్కాడ్ లతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అత్యాచారానికి గురైన మహిళలు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.
Read more: PM Kisan: పీఎం కిసాన్ 20వ విడుత నిధుల మంజూరు తేదీ వచ్చిందోచ్.. ఎప్పుడో తెలుసుకోండి..
వాళ్లను ప్రైవేటు ఆస్పత్రికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదు ధారంగా.. రేప్, గ్యాంగ్ రేప్, దొంగతనం కేసు బుక్ చేశారు. నిందితుల్ని గుర్తించామని, పట్టుకునేందుకు రెండు స్పెషల్ టీమ్స్ దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవ రోజు ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కూడా దీనిపై సీరియస్ గా చర్యలు చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









